Apple New Stores : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో భారత్‌లో కొత్త ఆపిల్ రిటైల్ స్టోర్లు.. లొకేషన్స్ ఫిక్స్..!
Apple New Stores : భారత్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్లను మరింతగా విస్తరించనుంది. మూడో ఆపిల్ స్టోర్ నోయిడాలో, నాల్గవది పూణేలో ప్రారంభించనున్నట్టు సమాచారం. బెంగళూరు, ముంబైలలో మరో రెండు స్టోర్లను ప్రారంభించాలని యోచిస్తోంది.

Apple New Stores
Apple New Stores : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ భారత మార్కెట్లో రిటైల్ కార్యకలాపాలను విస్తరించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆపిల్ కొత్త రిటైల్ స్టోర్ల లొకేషన్లను ఖరారు చేసినట్లు సమాచారం. నివేదిక ప్రకారం.. కుపెర్టినోకు చెందిన టెక్ దిగ్గజం దేశంలో ఆపిల్ మూడో స్టోర్‌ను నోయిడాలోని DLF మాల్ ఆఫ్ ఇండియాలో ప్రారంభించాలని యోచిస్తోంది.
అదే సమయంలో, భారతీయ నాల్గో ఆపిల్ స్టోర్ కోసం పూణేలోని కోపా మాల్‌ను ఖరారు చేసింది. అంతేకాదు.. కంపెనీ మరో రెండు స్టోర్లను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. దాంతో దేశంలో మొత్తం ఆపిల్ స్టోర్ల సంఖ్య ఆరుకు చేరుకుంటుంది.
భారత్‌లో మరో 4 కొత్త ఆపిల్ స్టోర్లు :
నివేదికల ప్రకారం.. ఆపిల్ భారత్‌లో రిటైల్ విస్తరణ రెండవ దశకు సన్నాహాలు చేస్తోంది. ప్రణాళికలలో భాగంగా, కంపెనీ మూడు, నాల్గవ ఆపిల్ స్టోర్ల కోసం లొకేషన్లను ఎంచుకుంది. వరుసగా నోయిడా, పూణే లొకేషన్లను ఖరారు చేసింది. ఈ నగరాలతో పాటు, ఐఫోన్ తయారీదారు బెంగళూరు, ముంబైలలో మరో రెండు ప్రదేశాల కోసం కూడా వెతుకుతోంది.
ప్రస్తుతం భారత్‌లో ఆపిల్‌కు రెండు అధికారిక స్టోర్లు ఉన్నాయని తెలిసిందే. ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్, ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్నాయి. ఈ రెండు స్టోర్లలో అమ్మకాల మొదటి ఏడాదితో కలిపి రూ. 800 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి.
ఆపిల్ సాకేత్ చిన్న స్టోర్ అయినప్పటికీ 60 శాతం వాటాను కలిగి ఉంది. ఆపిల్ ప్రణాళికలతో ముందుకు సాగితే.. నోయిడా ఆపిల్ స్టోర్ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఐఫోన్ తయారీదారు రెండో రిటైల్ అవుట్‌లెట్‌గా అవతరించనుంది.
అంతేకాకుండా, ప్రతిపాదిత ముంబై స్టోర్ నగరంలో రెండో అధికారిక ఆపిల్ స్టోర్ కావచ్చు. ఈ రిపోర్టులో ఆపిల్ లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసిన 20 జాబ్ లిస్టును సూచిస్తుంది. ఇందులో ఎక్కువ భాగం నియామకాలు రిటైల్ కార్యకలాపాలకు సంబంధించినవే ఉన్నాయి. ఆపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓ’బ్రియన్ 2024 అక్టోబర్‌లో కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు.
ఆ తర్వాత, కంపెనీ భారత్‌లో రాబోయే కార్యకలాపాలను విస్తరించడానికి దాదాపు 400 మంది ఉద్యోగులను నియమించింది. ఆపిల్ ప్రస్తుత సెలెక్ట్ సిటీవాక్ మాల్ BKC స్టోర్లలో 90-100 మంది ఉద్యోగులు ఉన్నారని అంచనా. కంపెనీ బెంగళూరు, పూణే, ఢిల్లీ-NCR, ముంబైలలోని ఫ్యూచర్ ఆపిల్ స్టోర్ల కోసం మరిన్ని నియామకాలను ప్లాన్ చేస్తుందని నివేదిక వెల్లడించింది.