Apple First Store In India : ముంబైలో ఆపిల్ ఫిజికల్ రిటైల్ స్టోర్ ప్రారంభించిన టిమ్ కుక్.. కస్టమర్లకు గ్రాండ్ వెల్కమ్..!
Apple First Store In India : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ మొట్టమొదటి ఫిజికల్ రిటైల్ స్టోర్ ( Apple First physical retail store)ను ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ (Jio World Drive Mall)లో ప్రారంభమైంది. ఆపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ (Tim Cook) భారత మొట్టమొదటి ఆపిల్ ఫిజికల్ రిటైల్ స్టోర్ డోర్స్ ఓపెన్ చేశారు.

Apple's First Store In India Opens In Mumbai, Tim Cook Welcomes Customers
Apple First Store In India : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ మొట్టమొదటి ఫిజికల్ రిటైల్ స్టోర్ ( Apple First physical retail store)ను ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ (Jio World Drive Mall)లో ప్రారంభమైంది. ఆపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ (Tim Cook) భారత మొట్టమొదటి ఆపిల్ ఫిజికల్ రిటైల్ స్టోర్ డోర్స్ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా వేలాది మంది ఆపిల్ అభిమానులు, టెక్ ఔత్సాహికులు బయటి నుంచి భారీగా తరలివచ్చారు.
ముంబైలోని ఆపిల్ మొట్టమొదటి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా అభిమానుల పెద్ద సంఖ్యలో క్యూలో బారులు తీరారు. చాలామంది టెక్ ఔత్సాహికులు బిగ్గరగా అరుస్తూ మిలియన్ల కొద్దీ సెల్ఫీలతో స్టోర్ వద్ద సందడి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఈ ఆపిల్ స్టోర్ నుంచి కస్టమర్లు ఆపిల్ ప్రొడక్టులను కొనుగోలు చేయొచ్చు.

Apple’s First Store In India Opens In Mumbai, Tim Cook Welcomes Customers
భారతీయ మార్కెట్లో ఆఫ్‌లైన్ ఉనికిని పెంచడానికి ఇతర పోటీదారు శాంసంగ్‌కు పోటీగా ఆపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్ ప్రారంభించింది. Apple BKC స్టోర్ ప్రారంభోత్సవానికి దాదాపు 5వేల మంది టెక్ ఔత్సాహికులు హాజరయ్యారు. వీరిలో చాలామంది ఉదయం 8 గంటలకే స్టోర్ వద్దకు చేరుకున్నారు. అధికారికంగా స్టోర్ ఓపెన్ చేయడానికి దాదాపు మూడు గంటల ముందు ఆపిల్ సోమవారం స్టోర్ ప్రత్యేక ప్రివ్యూను కూడా నిర్వహించింది. కొంత మంది మీడియా నిపుణులకు కూడా స్టోర్‌లో ప్రత్యేకంగా సందర్శనకు అనుమతి కల్పించారు.
#WATCH | Apple CEO Tim Cook opens the gates to India’s first Apple store at Mumbai’s Bandra Kurla Complex pic.twitter.com/MCMzspFrvp
— ANI (@ANI) April 18, 2023
ఆపిల్ స్టోర్‌లో షాపింగ్ చేసేందుకు ప్రత్యేకమైన విధానాన్ని కలిగి ఉంది. చాలా విశాలంగా ఉంది. గాజు గోడల నుంచి సూర్యరశ్మి వచ్చేలా రూపొందించారు. స్టోర్ లోపల అందమైన మొక్కలు కూడా ఉన్నాయి. బహుశా కంపెనీ మొత్తం పర్యావరణ అనుకూల విధానానికి ఈ స్టోర్ డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఆపిల్ అత్యంత స్టేబుల్ స్టోర్లలో ఒకటిగా పేర్కొంది. కార్బన్ న్యూట్రల్, 100 శాతం పునరుత్పాదక శక్తితో పని చేస్తుంది. సేల్స్ టీమ్ సభ్యుల టీ-షర్ట్ రంగులలో (ఆకుపచ్చ) స్టేబులిటీ, గ్రీన్ థీమ్ ప్రతిబింబిస్తుంది. ఆపిల్ సిబ్బంది చాలా అన్ని భాషల్లోనూ మాట్లాడగలరు. BKC స్టోర్‌లోని 100 మంది సభ్యుల బృందం వారి మధ్య 20 కన్నా ఎక్కువ భాషలను మాట్లాడగలరు. ప్రతి ఆపిల్ ప్రొడక్టును అర్థం చేసుకునేలా కావలసిన టెక్నాలజీల ద్వారా సందర్శకులకు మార్గనిర్దేశం చేయగలరు.

Apple’s First Store In India Opens In Mumbai, Tim Cook Welcomes Customers
BKC స్టోర్ డిజైన్ అదుర్స్.. స్టోర్ ఎలా నిర్మించారంటే? :
ముంబై స్టోర్ ప్రాథమిక డిజైన్ ఫిలాసఫీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఆపిల్ స్టోర్ల మాదిరిగానే కనిపిస్తోంది. ఆపిల్ ఈ స్టోర్‌కు కొద్దిగా భారతీయ అభిరుచిని కూడా జోడించింది. సోర్ట్ ఫ్రెంట్ అంతా గ్లాసు ఫిటింగ్‌తో ఆకర్షణీయంగా త్రిభుజాకారంగా డిజైన్ చేసింది. చేతితో చేసిన కలపతో పైకప్పును రూపొందించారు. ఢిల్లీ నుంచి సేకరించిన 4,50,000 కలప మూలకాలను ఈ స్టోర్ నిర్మాణానికి వినియోగించారు. కస్టమర్లు స్టోర్‌లోకి ప్రవేశించిన వెంటనే, 14-మీటర్ల పొడవాటి స్టెయిన్లెస్ స్టీల్ మెట్లు, రెండు గ్రే కలర్ రాతి గోడలు కనిపిస్తాయి. ఇందులో మొజాయిక్ ఫ్లోరింగ్‌తో పాటు రాతిని అన్నీ రాజస్థాన్ నుంచి సేకరించారు.

Apple’s First Store In India Opens In Mumbai, Tim Cook Welcomes Customers
MacBooks, iPhoneలు, iPad, స్మార్ట్‌వాచ్‌లు భారత మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆపిల్ అన్ని ప్రొడక్టులను స్టోర్ విక్రయిస్తుంది. దీంతో పాటు ఆపిల్ ఆర్కేడ్, ఆపిల్ HomePod, Apple Music, Apple TV+ని కూడా ప్రదర్శిస్తుంది. సందర్శకులకు అవసరమైన సాయం అందించేందుకు స్టోర్ మొదటి అంతస్తులో జీనియస్ బార్ కూడా ఉంది. భారత్‌లో తన మార్కెట్ మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఆపిల్ ఈ స్టోర్ ప్రారంభంతో మరో పెద్ద అడుగు వేస్తోంది. గత రెండు ఏళ్లుగా ఆపిల్ భారతీయ మార్కెట్‌ను నిశితంగా పరిశీలిస్తోంది.

Apple’s First Store In India Opens In Mumbai, Tim Cook Welcomes Customers
అమెరికా-చైనా ఉద్రిక్తతల మధ్య చైనా వెలుపల తయారీని వైవిధ్యపరచేందుకు ఆపిల్ చైనా-ప్లస్-వన్ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అందులో చాలా వరకు ఆపిల్ భారత్‌ను తమ ప్రధాన తయారీ కేంద్రంగా ఆవిర్భవించటానికి కారణమని చెప్పవచ్చు. 2017లో ఆపిల్ పాత ఐఫోన్ మోడల్‌ల తయారీని భారత్‌లోనే ప్రారంభించింది. గత ఏడాది నుంచి లేటెస్ట్ ఐఫోన్ మోడల్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. Apple BKC దేశంలోనే మొదటి స్టోర్ అయితే, రెండో స్టోర్ ఏప్రిల్ 20న న్యూఢిల్లీలో ఓపెన్ చేయనుంది.