Asus TUF Gaming A15 Laptop : అమెజాన్ బంపర్ ఆఫర్.. భారీ తగ్గింపు ధరకే గేమింగ్ ల్యాప్‌టాప్.. ఈ అద్భుతమైన డీల్ వదులుకోవద్దు..!

Asus TUF Gaming A15 Laptop : గేమింగ్ ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఆసుస్ TUF గేమింగ్ A15 ల్యాప్‌టాప్ అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.

Asus TUF Gaming A15 Laptop : అమెజాన్ బంపర్ ఆఫర్.. భారీ తగ్గింపు ధరకే గేమింగ్ ల్యాప్‌టాప్.. ఈ అద్భుతమైన డీల్ వదులుకోవద్దు..!

Asus TUF Gaming A15 Laptop

Updated On : May 27, 2025 / 10:35 PM IST

Asus TUF Gaming A15 Laptop : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? తక్కువ ఖర్చుతో అద్భుతమైన (Asus TUF Gaming A15 Laptop) గేమింగ్ ల్యాప్‌టాప్ కొనేసుకోవచ్చు. AMD రైజెన్ 7 సిరీస్ ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌‌తో ASUS TUF గేమింగ్ A15 ల్యాప్‌టాప్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Read Also : UPI Limit : యూపీఐ యూజర్లకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్.. ఇకపై పేమెంట్లపై లిమిట్స్.. ఫుల్ డిటెయిల్స్..!

ప్రస్తుతం అమెజాన్‌లో ఈ డిస్కౌంట్ అందిస్తోంది. మే 24 నుంచి మే 28 వరకు గ్రాండ్ గేమింగ్ డేస్ సేల్‌ కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో ఆసుస్ TUG గేమింగ్ ల్యాప్‌టాప్ సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.

గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై 70శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఆసుస్ TUF గేమింగ్ A15 ల్యాప్‌టాప్ డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.74,990 ఉండగా, అమెజాన్‌లో రూ.20వేలు ధర తగ్గింది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్‌లో ల్యాప్‌టాప్ ధర ఎంతంటే? :
ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్ రూ.56,990 ధరకు అందుబాటులో ఉంది. రూ.18వేలు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు HDFC, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.2వేలు బ్యాంక్ డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు.

పాత ల్యాప్‌టాప్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.4,850 వరకు ఎక్స్ఛేంజ్ పొందవచ్చు. కస్టమర్లు నెలకు రూ.2,763 నుంచి ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.

AMD రైజెన్ 7 స్పెసిఫికేషన్లు :
ఆసుస్ TUF గేమింగ్ A15 AMD రైజెన్ 7 (Asus TUF Gaming A15 Laptop) 7435HS ప్రాసెసర్‌తో వస్తుంది. 8 కోర్లతో పాటు 4.5 GHz వరకు స్పీడ్ అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌‌డీ యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

144Hz రిఫ్రెష్ రేట్, 250 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. గ్రాఫిక్స్ విషయానికి వస్తే.. 4GB NVIDIA జీఫోర్స్ RTX 2050 జీపీయూని అందిస్తుంది.

Read Also : WhatsApp iPad : పండగ చేస్కోండి.. ఐప్యాడ్ యూజర్ల కోసం వాట్సాప్ వచ్చేసిందోచ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!

ఆసుస్ (TUF) గేమింగ్ A15 16GB ఫాస్ట్ DDR5 ర్యామ్ (32GB వరకు), 512GB PCIe 4.0 SSD స్టోరేజీతో సపోర్టు ఇస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా సపోర్టు అందిస్తుంది. 48WHrs బ్యాటరీతో వస్తుంది. కేవలం 30 నిమిషాల్లో ఆసుస్ 50శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.