Ather Energy : అతిపెద్ద ఛార్జింగ్ నెట్‌వర్క్‌గా ఏథర్ ఎనర్జీ.. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో 1000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు!

Ather Energy : ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather) భారత మార్కెట్లో 80 నగరాల్లో 1,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, ఏథర్ గ్రిడ్‌లను ఏర్పాటు చేసింది.

Ather Energy : అతిపెద్ద ఛార్జింగ్ నెట్‌వర్క్‌గా ఏథర్ ఎనర్జీ.. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో 1000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు!

Ather Energy installs over 1,000 fast-charging grids across India

Updated On : February 18, 2023 / 10:18 PM IST

Ather Energy : ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather) భారత మార్కెట్లో 80 నగరాల్లో 1,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, ఏథర్ గ్రిడ్‌లను ఏర్పాటు చేసింది. 450 ప్లస్ మరియు 450X ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించే
ఏథర్ ఎనర్జీ కంపెనీ.. 2023 చివరి నాటికి 2,500 కన్నా ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్‌లను ఇన్‌స్టాల్ చేయాలని యోచిస్తోంది. భారత మార్కెట్లో రూపొందించిన ఏథర్ గ్రిడ్, దేశంలోని ద్విచక్ర వాహనాల (EV) కోసం అతిపెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌గా అవతరించింది.
ప్రస్తుత ఇన్‌స్టాలేషన్‌లలో 60శాతం టైర్-II, టైర్-III నగరాల్లో ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను నిర్మించడంపై దృష్టి సారించిన ఏథర్ ఎనర్జీ అంతకుముందు అన్ని ఒరిజినల్ డివైజ్‌ల తయారీదారులకు (OEMలు) ఛార్జింగ్ కనెక్టర్ కోసం IPని రిలీజ్ చేసింది. తద్వారా ఇంటర్‌ ఆపరబుల్ టూ-వీలర్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్లాట్‌ఫారమ్‌కు మార్గం సుగమం చేసింది.

Read Also : Nokia X30 vs Nokia G60 : నోకియా X30, నోకియా G60 ప్రాసెసర్ సేమ్.. ధర, ఫీచర్లు ఇవే.. రెండు ఫోన్లలో ఏది బెటర్ అంటే?

కంపెనీ ప్రకారం.. ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు EV యజమానులు తమ వాహనాలను 1.5 కిమీ/నిమిషానికి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ నెట్‌వర్క్‌కు Ather గ్రిడ్ యాప్ సపోర్టు ఇస్తుంది. EV యజమానులందరూ రియల్ టైంలో సమీప ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించడానికి చెక్ చేయడానికి అనుమతిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లు ఉపయోగించుకోవచ్చు.

Ather Energy installs over 1,000 fast-charging grids across India

Ather Energy installs over 1,000 fast-charging grids across India

ఈ సదుపాయం మార్చి 2023 వరకు ఉచితంగా అందించనుంది. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడంలో బలమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ప్రధాన డ్రైవర్లలో ఒకటి. పవర్‌ఫుల్ EV పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించిన బ్రాండ్‌గా ఇప్పటికే భారత మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను నిర్మించడంలో బలమైన పెట్టుబడులు పెట్టినట్టు ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ ఫోకెలా తెలిపారు.

నైబర్‌హుడ్ ఛార్జింగ్‌ను కూడా మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. అపార్ట్‌మెంట్ బ్లాక్‌లు, ఆఫీసులు, టెక్ పార్కులు మొదలైన సెమీ-ప్రైవేట్ స్పేస్‌లపై ఛార్జింగ్ సొల్యూషన్ దృష్టి సారించినట్టు ఆయన చెప్పారు. స్పేస్‌లో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమ వృద్ధికి సపోర్టు ఇవ్వడానికి కట్టుబడి ఉంటామన్నామని అన్నారు. ఏథర్ ఎనర్జీ అత్యుత్తమ నెలవారీ హోల్‌సేల్స్‌ను రిజిస్టర్ చేసింది, జనవరి 2023లో 12,419 యూనిట్లను పంపిణీ చేసింది. గత ఏడాదిలో కంపెనీ హోసూర్‌లో రెండో తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది.

Read Also : Vivo Y56 5G Launch : రూ. 20వేల లోపు ధరకే డ్యూయల్ కెమెరాలతో వివో Y56 5G బడ్జెట్ ఫోన్.. కొనే ముందు ఫీచర్లు ఓసారి లుక్కేయండి..!