Bank Strike Alert : బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. వరుసగా ఫోర్ డేస్ బ్యాంకులు బంద్.. ఎందుకు.. ఏఏ రోజుల్లో అంటే?
Bank Strike Alert : బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. ఐదు రోజుల పనిదినాలను కోరుతూ జనవరి 27వ తేదీన సమ్మెను ప్రకటించారు. దీంతో ఆరోజు కూడా బ్యాంకులు బంద్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
bank customers
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్
- బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు బంద్
- జనవరి 27న సమ్మె బాటపట్టనున్న బ్యాంకు ఉద్యోగులు
Bank Strike Alert : ఈ నెల చివరి వారంలో మీకు బ్యాంకులో ఏదైనా పని ఉందా..? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి. ముందుగానే బ్యాంకులకు వెళ్లి మీ పనులు పూర్తి చేసుకోండి.. ఎందుకంటే జనవరి చివరి వారంలో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకులు మూతపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మూడు రోజులు సెలవులు ఖరారు కాగా.. నాలుగో రోజు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడంతో వరుసగా బ్యాంకులు మూతపడనున్నాయి.
జనవరి 24వ తేదీన నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. మరుసటి రోజు జనవరి 25 ఆదివారం సెలవు. ఆ తరువాత జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు హాలిడే ఉంటుంది. దీంతో మూడు రోజులు బ్యాంకులకు అధికారికంగా సెలువులు వచ్చాయి. జనవరి 27వ తేదీన కూడా బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది.
బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. ఐదు రోజుల పనిదినాలను కోరుతూ జనవరి 27వ తేదీన సమ్మెను ప్రకటించారు. దీంతో 27వ తేదీన కూడా బ్యాంకులు బంద్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ సమ్మె కంటిన్యూ అయితే, వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంక్ శాఖలు దేశవ్యాప్తంగా మూతపడే చాన్స్ ఉంది. దీంతో ఈనెలాఖరులో మొత్తం బ్యాంకులు మూతపడే అవకాశం లేకపోలేదు.
ఉద్యోగులు పని గంటలను తగ్గిస్తే కస్టమర్లకు సేవలు అంతరాయం కలగకుండా చూసుకోవడానికి సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని యూఎఫ్‌బీయూ ప్రకటించింది. అయితే, దీనిపై ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది ప్రభుత్వం, ఆర్బీఐ. జనవరి 27వ తేదీన సమ్మెకు ముందే ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపితే వినియోగదారులకు ఊరట లభిస్తుంది. లేదంటే జనవరి నెల చివరి వారం మొత్తం బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది.
