BMW : భారత మార్కెట్లోకి కొత్తగా బీఎండబ్ల్యూ ఐ ఎక్స్1 పూర్తి ఎలక్ట్రిక్ కారు

జర్మన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూ మొట్టమొదటి సారి పూర్తి ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్ లో సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనుంది. బీఎండబ్ల్యూ ఐ ఎక్స్ 1 పేరిట పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారతదేశంలో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు జర్మన్ ఆటో దిగ్గజ సంస్థ ఎక్స్ లో పోస్టు చేసింది....

BMW : భారత మార్కెట్లోకి కొత్తగా బీఎండబ్ల్యూ ఐ ఎక్స్1 పూర్తి ఎలక్ట్రిక్ కారు

BMW to launch iX1 electric SUV

BMW to launch iX1 electric SUV : జర్మన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూ మొట్టమొదటి సారి పూర్తి ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్ లో సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనుంది. బీఎండబ్ల్యూ ఐ ఎక్స్ 1 పేరిట పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారతదేశంలో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు జర్మన్ ఆటో దిగ్గజ సంస్థ ఎక్స్ లో పోస్టు చేసింది. (BMW to launch iX1 electric SUV) ఎలక్ట్రిక్ వాహనం (EV) ఎక్స్-షోరూమ్ ధర రూ.70 లక్షలు ఉండవచ్చని అంచనా వేశారు.

Next Pandemic Disease X : కొవిడ్ కంటే ఎక్స్ మహమ్మారి ప్రాణాంతకం…50 మిలియన్ల మందిని చంపగలదని అంచనా

ఈ కారు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ 313 హెచ్ పీ గరిష్ఠ శక్తి ఉంటుంది. (electric SUV in India on September 28) ఈ కారు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగం ఉంటుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ ప్యాక్ 64.7 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ యూనిట్‌గా ఉంటుంది. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే కారు 438 కిలోమీటర్ల దూరం నడవనుంది.

Rahul Gandhi: రైలులో ప్రయాణించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రయాణికులతో చిట్ చాట్

11 కేడబ్ల్యూ 3-ఫేజ్ ఆన్-బోర్డ్ ఛార్జర్ బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేస్తుంది. ఈ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు తయారీదారు టచ్ ఫంక్షన్‌తో 10.7-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌తో డామినేట్ చేసిన డాష్‌బోర్డ్ అందించారు. 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, వాయిస్ కంట్రోల్ మొదలైన సౌకర్యాలు ఈ కారులో ఉన్నాయి.