Gas Cylinder Price : గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధర
జూన్ నెల ప్రారంభంలో వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు దేశంలోని చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గతంలో వరుసగా పెంచుకుంటూ పోయిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ..

LPG Gas Cylinder Price
LPG Gas Cylinder Price : జూన్ నెల ప్రారంభంలో వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు దేశంలోని చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గతంలో వరుసగా పెరుగుతూపోయిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (వాణిజ్య గ్యాస్ సిలిండర్) ధరలు గత మూడు నెలలుగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా 19కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలీండర్ పై రూ. 69.50 తగ్గింది. కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. మరోవైపు 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ (గృహ వినియోగ వంటగ్యాస్) ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.
Also Read : భారత రాఫెల్ యుద్ధ విమానాలకు కౌంటర్‌గా పెద్ద ప్లాన్ వేసి.. సరిహద్దుల వద్ద అమలు చేస్తున్న చైనా
దేశరాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 69.50 తగ్గింది. దీంతో అక్కడ ప్రస్తుతం 19కిలోల సిలిండర్ ధర రూ. 1676కు లభ్యంకానుంది. ముంబైలో రూ.1,629, చెన్నైలో రూ.1,840.50, లక్నోలో రూ.2,050కి వ్యాణిజ్య సిలిండర్ లభ్యమవుతుంది. ఇక కోల్ కతాలో రూ. 72 తగ్గింది. దీంతో అక్కడ రూ.1787కు కమర్షియల్ సిలిండర్ లభ్యమవుతుంది. హైదరాబాద్ నగరంలో గ్యాస్ సిలిండర్ రేట్ల తగ్గింపుపై స్పష్టత లేదు. ప్రస్తుతం 19కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,975.50 వద్ద లభ్యమవుతుంది.
Also Read : ఎన్నికల ఫలితాలను తేల్చే ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఇంత ఉత్కంఠ ఎందుకు నెలకొందో తెలుసా?
గృహ వినియోగ సిలిడర్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర గతేడాది ఆగస్టులో రాఖీ సందర్భంగా రూ.200 తగ్గింది. ఈ ఏడాది మార్చిలో మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. వెయ్యి తగ్గించింది. ఆ తరువాత డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 855 వద్ద లభ్యమవుతుంది.