AI Professionals : భారత్‌లో AI నిపుణులకు ఫుల్ డిమాండ్.. 2026 నాటికి మిలియన్‌కు చేరే ఛాన్స్..!

AI Professionals : భారతీయ టెక్ పరిశ్రమలో ఏఐ నిపుణులకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. 2026 నాటికి పది లక్షల మందికి చేరుకునే అవకాశం ఉంది.

AI Professionals : భారత్‌లో AI నిపుణులకు ఫుల్ డిమాండ్.. 2026 నాటికి మిలియన్‌కు చేరే ఛాన్స్..!

AI professionals

Updated On : June 1, 2025 / 6:26 PM IST

AI Professionals : టెక్నాలజీ రంగంలో ఏఐకి ఫుల్ క్రేజ్ పెరిగిపోతోంది. ఏపీకి డిమాండ్ తగినట్టుగా టెక్ కంపెనీలు సైతం ఏఐ ఆధారిత అప్లికేషన్లు డెవలప్ చేస్తున్నాయి.

Read Also : BigBasket : స్విగ్గీ, జొమాటోకు పోటీగా బిగ్‌బాస్కెట్.. కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ.. ఫుల్ డిటెయిల్స్..!

ఈ నేఫథ్యంలో భారతీయ టెక్ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నిపుణులకు డిమాండ్ భారీగా పెరగనుంది. 2026 నాటికి 10 లక్షల మంది ఏఐ స్కిల్స్ కలిగిన వారి అవసరం మరింత పెరగనుందని అంచనా.

ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ‘ఇండియాస్ ఏఐ రివల్యూషన్ వీక్షిత్ భారత్ కు రోడ్ మ్యాప్’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. 2047 నాటికి భారత్ 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా అడుగులు వేస్తోంది.

ఇందులో ఏఐ, ఆటోమేషన్, ఇంటర్ డిసిప్లినరీ ఆవిష్కరణలతో ఉద్యోగ మార్కెట్ డిమాండ్లకు తగినట్టుగా ఉన్నత విద్యలో మరిన్ని విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

నాలుగేళ్లలో 16 శాతం పెరిగిన సీట్లు :
ప్రధానంగా ఇంజనీరింగ్ విద్య కేంద్ర బిందువుగా నిలువనుంది. ఆల్-ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ప్రకారం.. 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్ సీట్ల సంఖ్య 14.9 లక్షలకు పెరిగింది.

4 ఏళ్లలో దాదాపు 16 శాతం పెరిగింది. కంప్యూటర్ సైన్స్, అనుబంధ ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్‌చెయిన్‌లకు 50 శాతం కన్నా ఎక్కువ సీట్లు పెరగడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

ఇంటర్ డిసిప్లినరీ, ఇండస్ట్రీ-ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్‌ వంటి విద్యకు ఎక్కువ డిమాండ్ పెరుగుతోంది. కోడింగ్ సహా ఇతర కొత్త ఆవిష్కరణలను అందించే కొత్త జనరేషన్ ఇంజనీర్లను పెంచుకోవచ్చు.

సింబియోసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ) ఏఐ కేంద్రీకృత సంస్థ సింబియోసిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ (SAII)ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సంస్థ ప్రకారం.. SAII అత్యాధునిక ఏఐని విద్యాపరమైన పరిశోధనలలో ఇంటిగ్రేట్ చేస్తోంది.

28.8 బిలియన్ డాలర్లకు చేరువలో :
వీబాక్స్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ప్రకారం.. భారత్ ఏఐ పరిశ్రమ 2025 నాటికి 28.8 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. 45 శాతం (CAGR) ఉంటుందని అంచనా వేసింది.

Read Also : Best Smartphones : రూ. 25వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మోటో, వివో ఫోన్లు మాత్రం హైలెట్..!

2016 నుంచి 2023 వరకు ఏఐ నైపుణ్యం కలిగిన వారి సంఖ్య 14 రెట్లు పెరిగిందని సింగపూర్, ఫిన్లాండ్, ఐర్లాండ్, కెనడాలతో పాటు భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి 5 ఏఐ సెంటర్లలో ఒకటిగా నిలిచిందని నివేదిక వెల్లడించింది.