కరోనా ఎఫెక్ట్ : అతిపెద్ద బ్యాంకులో 35వేల ఉద్యోగాలు కోత!

హాంకాంగ్ : యూరప్ లోని అతిపెద్ద బ్యాంకు HSBC హోల్డింగ్స్ PLC సంస్థ రాబోయే మూడేళ్లలో 35 వేల ఉద్యోగాల్లో కోత విధించనుంది. 100 బిలియన్ డాలర్ల ఆస్తులను తొలగించనుంది. అమెరికా, యూరోపియన్ వ్యాపారాలను తీవ్రస్థాయిలో పునరుద్ధరించనుంది. మూడేళ్లలో 35,000 ఉద్యోగాల్లో కోత విధించనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రత్యర్థులతో పోటీపడటంలో వెనకపడ్డ బ్యాంక్.. తమ ప్రధాన మార్కెట్లలో మందగించిన వృద్ధి, కరోనావైరస్ మహమ్మారి, బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నిష్క్రమణ, సెంట్రల్ బ్యాంక్ తక్కువ వడ్డీ రేట్లతో పట్టు సాధించడంతో పాటు మరింత పోటీగా మారాలని ప్రయత్నిస్తోంది. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి వచ్చిన సమగ్ర మార్పులలో.. HSBC తన ప్రైవేట్ బ్యాంకింగ్, వ్యాపారాలను విలీనం చేస్తామని తెలిపింది.
యూరోపియన్ స్టాక్ ట్రేడింగ్‌తో పాటు యుఎస్ రిటైల్ శాఖలను తగ్గించి 4.5 బిలియన్ డాలర్ల వ్యయాన్ని తగ్గించనున్నట్టు తెలిపింది. రాబోయే మూడేళ్లలో తమ సంస్థ ఉద్యోగుల సంఖ్య 2 లక్షల 35వేల నుంచి 2లక్షలకు చేరుకునే అవకాశం ఉందని తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ నోయెల్ క్విన్ వెల్లడించారు. రుణాలు అందించే బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకు ఇదొకటి. బ్యాంకులో కస్టమర్ల సంఖ్య తగ్గినప్పటి నుంచి పాక్షికంగా నిర్వహిస్తోంది. కరోనావైరస్ మహమ్మారి సిబ్బంది, వినియోగదారులను గణనీయంగా ప్రభావితం చేసిందని హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది.
దీర్ఘకాలంలో ఇది ఆదాయాన్ని తగ్గించడమే కాకుండా అప్పులు పెరగడానికి కారణమవుతుందని క్విన్ చెప్పారు. ఈ వైరస్ చైనాలో ప్రధాన భూభాగంలో దాదాపు 1,900 మందిని పొట్టనబెట్టుకుంది. 70,000 మందికి పైగా సోకింది. వైరస్ కారణంగా దాని ఆర్థిక ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.
బ్యాంకు సీఈఓ పర్మినెంట్ రోల్ కోసం హెచ్‌ఎస్‌బిసి వెటరన్ మిస్టర్ క్విన్ ఆడిషన్ చేస్తుండగా.. ఆగస్టులో ఆరు నుంచి 12 నెలల్లో ప్రకటించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఆసియాలో ఆదాయంలో ఎక్కువ భాగాన్ని సంపాదించే యూరప్ అతిపెద్ద బ్యాంక్, ట్యాక్స్‌కు ముందు లాభం 2019 లో మూడవ వంతు తగ్గి 13.35 బిలియన్ డాలర్లకు పడిపోయింది.