FASTag Users Alert : ఫాస్టాగ్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. కొత్త వన్‌ట్యాగ్ ఫీచర్ వచ్చేసింది.. ఇక బ్యాంకులు మారినా నో టెన్షన్..!
FASTag Users Alert : కొత్త వన్‌ట్యాగ్ ఫీచర్ వచ్చేసింది. ఇకపై వాహన యజమానులు ఫాస్టాగ్ స్టిక్కర్‌ను మార్చకుండానే ఫాస్టాగ్ కార్డుల స్థానంలో కొత్త కార్డును పొందవచ్చు. పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
FASTag Users Alert
- ఫాస్టాగ్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్
- బ్యాంకులు మారినా స్టిక్కర్లు మార్చనక్కర్లేదు
- వన్ ట్యాగ్ ఫీచర్ అందుబాటులోకి
FASTag Users Alert : ఫాస్టాగ్ యూజర్లకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మీ పాత ఫాస్టాగ్ మార్చుకోవాలని అనుకుంటున్నారా? ప్రస్తుత బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మారాలని అనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఎవరైనా తమ ఫాస్టాగ్‌ను జారీ చేసిన బ్యాంకును మార్చుకోవాలంటే కొత్త ఫాస్టాగ్‌ను తీసుకోవాలి.
అంటే.. పాత ట్యాగ్‌ను క్లోజ్ చేసి కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆపై వాహనానికి కొత్త స్టిక్కర్‌ను కూడా అతికించాలి. అయితే, ఈ ఇబ్బంది అతి త్వరలో ముగియబోతోంది. ప్రభుత్వం ‘వన్ ట్యాగ్’ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఫాస్టాగ్ స్టిక్కర్‌ను మార్చకుండానే ఫాస్టాగ్ బ్యాంకును మార్చుకోవచ్చు.
కొత్త ఫాస్టాగ్ వన్‌ట్యాగ్ ఫీచర్ :
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో వన్‌ట్యాగ్ ఫీచర్‌ను ప్రారంభించారు. ఈ ఫీచర్ ద్వారా వాహన యజమానులు తమ వద్ద ఉన్న NETC ఫాస్టాగ్‌ను ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
అన్నింటికన్నా ముఖ్యంగా, బ్యాంకు ట్రాన్స్ఫర్ తర్వాత కూడా వాహనానికి అమర్చిన ఫిజికల్ ఫాస్టాగ్ మారదు. ఆ ట్యాగ్ ఐడీ, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే ఉంటాయి. అంటే.. కొత్త స్టిక్కర్ పొందేవరకు వాహనం విండ్‌స్క్రీన్‌కు తిరిగి స్టిక్ చేయాల్సిన అవసరం ఉండదు.
‘రాజమార్గ యాత్ర’తో బ్యాంకు ఎక్స్చేంజ్ :
NHAI అందించే రాజమార్గయాత్ర మొబైల్ యాప్ ద్వారా ఫాస్టాగ్‌ను మరో బ్యాంకుకు పోర్ట్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. బ్యాంకులను మార్చుకోవడానికి వినియోగదారులు కొన్ని అవసరమైన చెకింగ్స్, వెరిఫికేషన్లను పూర్తి చేయాలి.
Read Also : 8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. అదే జరిగితే ఆ ఉద్యోగుల జీతాలు డబుల్? పూర్తి లెక్కలివే..!
ఆ తర్వాత వినియోగదారుడి సమ్మతి అవసరం. ఆపై తమకు నచ్చిన కొత్త ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకును ఎంచుకోవచ్చు. కొత్త బ్యాంకుతో అవసరమైన ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ పూర్తి చేశాక ఫాస్టాగ్ సర్వీసు కొత్త బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అవుతుంది.
బ్యాంకు మారాక పాత ఖాతాకు సంబంధించిన సమాచారం పూర్తిగా డిలీట్ కాదు. ప్రస్తుత ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకు, రీఫండ్లు, పెండింగ్‌లో ఉన్న లావాదేవీలు, పాత వాలెట్‌కు సంబంధించి ఇతర ముఖ్యమైన విషయాలను పాత బ్యాంకునే చూసుకుంటుంది.
పోర్టబిలిటీలో పూర్తిగా మారిన తర్వాత నుంచి ఫాస్టాగ్ సంబంధిత సేవల బాధ్యత కొత్త బ్యాంకుదే.. వన్‌ట్యాగ్ టెక్ సపోర్టును NPCI మేనేజ్ చేస్తుంది. ఫాస్టాగ్ పోర్టబిలిటీ ప్రాసెస్ ఈజీ చేస్తుంది. NETC నెట్‌వర్క్‌లో జారీ చేసే బ్యాంకు సమాచారాన్ని కూడా ఇది అప్డేట్ చేస్తుంది.
వన్ట్యాగ్తో ప్రభుత్వానికి బెనిఫిట్స్ ఏంటి? :
వన్‌ట్యాగ్ ద్వారా బెనిఫిట్స్ కేవలం వాహన యజమానులకే కాదు.. ప్రభుత్వానికి కూడా భారీ ప్రయోజనం ఉంటుంది. కొత్త ఫాస్టాగ్‌లను తయారు చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే పాత ట్యాగ్‌లను తిరిగి జారీ చేయనక్కర్లేదు.
ఇన్ యాక్టివ్ చేయడం వంటివి తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు.. కొత్త ఫాస్టాగ్ స్టిక్కర్ల తయారీ, రవాణా, తిరిగి జారీకి వాడే వనరులు తగ్గుతాయి. తద్వారా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు భారీగా ఆదా అవుతుంది.
