చందాదారులకు శుభవార్త : EPFపై 8.65 శాతం వడ్డీ

  • Published By: madhu ,Published On : April 27, 2019 / 03:45 AM IST
చందాదారులకు శుభవార్త : EPFపై 8.65 శాతం వడ్డీ

Updated On : May 28, 2020 / 3:40 PM IST

ఉద్యోగుల భవిష్య నిధి (EPF)పై 2018 – 19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ అమలు కానుంది. కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వర్ అధ్యక్షతన EPFO సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల ఫార్మల్ సెక్టార్ కార్మికులుగా పనిచేస్తున్న సుమారు 6 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. 
Also Read : గ్రీన్ కలర్ లో కొత్త రూ.20 నోటు

2017- 18లో ఈపీఎఫ్ నిధులపై 8.55 శాతం వడ్డీ రేటు అమలు కాగా..ఇప్పుడు 8.65 శాతం చేశారు. 2016 – 17లో ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లు తగ్గించి 8.65 శాతం చేసింది. 2015 – 16 ఆర్థిక సంవత్సరానికి 8.8 శాతం వడ్డీ రేటు ఉంటే.. రెండు సంవత్సరాల్లో స్వల్పంగా తగ్గించారు. ఆదాయపన్ను, కార్మిక శాఖ వడ్డీ రేటును నోటిఫై చేసిన తర్వాత చందాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేయాలని దేశ వ్యాప్తంగా ఉన్న 120 అధికారులకు EPFO ఆదేశాలు జారీ చేసింది. 
Also Read : నిప్పుల కొలిమి : వరల్డ్ 15 హాటెస్ట్ నగరాలు భారత్‌లోనే