Flipkart చల్లటి వార్త : కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లపై ఆఫర్ 

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 07:50 AM IST
Flipkart చల్లటి వార్త : కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లపై ఆఫర్ 

Updated On : March 28, 2019 / 7:50 AM IST

వేసవి కాలం ఎండలు మండుతున్నాయి. ఇంట్లో కూడా మంట‌లే. రోజు రోజుకు పెరుగుతున్న వేసవి తాపాన్ని తగ్గించుకునేలా చల్లటి గుడ్ న్యూస్ ను మోసుకొచ్చింది ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్. కూలింగ్ డేస్ సేల్ ఆఫ‌ర్స్ ప్ర‌క‌టించింది. ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటాం కానీ వేడి గాలి వస్తుంది. అప్పుడు కూలర్ వేసుకోవాల్సిందే తప్పదు మరి. ఇంకొంచెం డబ్బులుంటే చల్ల చల్లని ఏసీ కూడా పెట్టుకోవచ్చు. డబ్బు ఎక్కువ పెట్టాలని అనుకోవద్దు.. ఫ్లిప్‌కార్ట్ కూల్ డేస్ సేల్ లో 55 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. 

ఇవి అన్ని రకాల డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఈ మెగా ఆఫర్ మార్చి 28 నుంచి 30 వరకు మాత్రమే కూలింగ్ డేస్ సేల్ అందుబాటులో ఉంటుంది. 

ఈ కూలింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఏసీల ధర రూ.19,999 నుంచి ప్రారంభమవ్వగా…సీలింగ్ ఫ్యాన్లపై 40 శాతం..కూలర్లపై ఏకంగా 55 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే ఫ్రిజ్‌లు రూ.6,999 నుంచి ప్రారంభమవ్వగా..డబుల్ డోర్ ఫ్రిజ్‌ను రూ.19,990కే అందుబాటులో ఉంటుంది. మరో విషయం ఏంటంటే నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఇన్వర్టర్లపై కూడా 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. సో ఈ వేసవిని ఫ్లిప్‌కార్ట్  కూలింగ్ డేస్ సేల్ తో చల్లచల్లగా ఎంజాయ్ చేయండి..