Adani bribery case: గౌతమ్ అదానీ కేసులో కీలక పరిణామం.. సంయుక్త విచారణకు న్యూయార్క్ కోర్టు ఆదేశం..!
Adani bribery case : పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ, ఇతరులపై కొనసాగుతున్న మూడు కేసులను కలిపి సంయుక్తంగా విచారించాలని న్యూయార్క్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Adani bribery case
Adani Bribery Case : గౌతమ్ ఆదానీకి అమెరికా గట్టి షాకిచ్చింది. సోలార్ కాంట్రాక్టుల కోసం ఆదానీ గ్రూపు (260 మిలియన్ డాలర్లు ) అంచాలు ఇచ్చిందనే ఆరోపణలకు సంబంధించి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ, ఇతరులపై కొనసాగుతున్న మూడు కేసులను కలిపి సంయుక్తంగా విచారించాలని న్యూయార్క్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులను ఉమ్మడి విచారణలో కలిపి విచారించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇలాంటి ఆరోపణలు కేవలం లావాదేవీలు వల్లే కేసులు ఉత్పన్నమవుతాయని కోర్టు గుర్తిస్తూ ఈ తీర్పును వెలువరించింది.
Read Also : Gossip Garage : నాడు ఓ వెలుగు వెలిగారు, నేడు పుట్టెడు కష్టాలు..! ఆ ముగ్గురు నానీల పరిస్థితి ఇలా ఎందుకైంది?
ఆ ఉమ్మడి కేసుల్లో యూఎస్ వర్సెస్ అదానీ, ఇతరులు (అదానీపై క్రిమనల్ కేసు), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(SEC) vs అదానీ, ఇతరులు ( అదానీపై సివిల్ కేసు), SEC vs కాబనేస్ (ఇతర నిందుతులపై సివిల్ కేసు) ఉన్నాయి.
వీటిన్నింటిని కలిపి సంయుక్తంగా విచారణ జరపాల్సిందిగా కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. న్యాయవ్యవస్థ సామర్థ్యాన్ని షెడ్యూల్ తగినట్టుగా ఉండేలా కోర్టు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అదానీపై క్రిమినల్ కేసును పర్యవేక్షిస్తున్న జిల్లా జడ్జ్ నికోలస్ జీ గరౌఫీస్‌కి అన్ని కేసులు అప్పగించనున్నారు.
కేసుల పునర్విభజన చేపట్టాలని కూడా కోర్టు సిబ్బందిని ఆదేశించింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలతో సోలార్ ఎనర్జీ ఒప్పందాలను పొందడానికి అదానీ, ఇతరులు 265 మిలియన్లు డాలర్లు (దాదాపు రూ. 2,029 కోట్లు) లంచంగా చెల్లించినట్లు అభియోగాలు మోపారు.
సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ నిధులు సేకరించిన అమెరికా బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి వాస్తవాన్ని దాచిపెట్టారని యూఎస్ ప్రాసిక్యూటర్లు అంతకుముందు ఆరోపించారు. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ ఆరోపణలను “నిరాధారం” అని కొట్టిపారేసింది.
Read Also : Tesla Cybertruck Blast : టెస్లా సైబర్ ట్రక్ బ్లాస్ట్.. తప్పు వాహనాన్ని వాడారు.. ఇది ఉగ్రవాదుల పనే.. మస్క్