ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్‌కు అన్ని పెట్రోల్ స్టేషన్లు అవసరమే!

ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రీఫిల్లింగ్ సమస్యను అధిగమించేందుకు ఎలక్ట్రిక్ కార్లకు ఛార్జింగ్ కోసం అన్ని పెట్రోల్ స్టేషన్లు ఆఫర్ చేయాలని భావిస్తున్నట్టు జర్మనీ తెలిపింది. గతవారంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రోన్ ప్రకటించిన ఎలక్ట్రిక్ కారు సేల్స్ ప్రకటన తర్వాత జర్మీనీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. బ్యాటరీ పవర్ వాహనాలపై స్పష్టత రావడంతో భవిష్యత్ లో ఎలక్ట్రిటీ మొబిలిటీ రాబోతోందని ఎనర్జీ స్టోరేజీ స్పెషలిస్టు ది మొబిలిటీ హౌస్ పేర్కొంది. అంతర్జాతీయంగా జర్మనీని బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ సపోర్టు లీడింగ్ గ్రూపులో ఉండేలా చేసింది.
ప్రభుత్వ ఉద్దీపనలో 2.5 బిలియన్ యూరోలను బ్యాటరీ సెల్ ప్రొడక్షన్, ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్టక్చర్ పై ఖర్చు చేయనుంది. పరిమిత ఆపరేటింగ్ శ్రేణి వాహనాలపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల కోసం వినియోగదారుల డిమాండ్ పరిమితం చేసింది. గత ఏడాదిలో జర్మనీలో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి కొత్త ప్యాసెంజర్ కారు రిజిస్ట్రేషన్లు 1.8 శాతం మాత్రమే పెరిగాయి. అందులో పెట్రోల్, డీజిల్ కార్లు 32 శాతం, 59.2 శాతంగా నమోదయ్యాయి. మే నెలలో కొత్త రిజిస్ట్రేషన్లు 168, 148 నమోదు కాగా, అందులో 5, 578 లేదా 3.3 శాతం ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే ఉన్నాయని జర్మనీ వాహన ఏజెన్సీ KBA వెల్లడించింది.
మార్చి 2020 నాటికి జర్మనీలో 27, 730 ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని BDEW పేర్కొంది. ఎలక్ట్రిక్ కార్ల భారీ మార్కెట్ లక్ష్యాన్ని సాధించేందుకు కనీసం 70వలే ఛార్జింగ్ స్టేషన్లు, 7వేల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు అవసరమని BDEW తెలిపింది. గత దశాబ్ద కాలంలో 40 శాతం మేర విద్యుత్ వాహనాల పర్ఫార్మెన్స్ మెరుగుపడింది. గ్యాసోలిన్‌తో నడిచే కార్ల ఇంధన సామర్థ్యంలో ఇదే విధమైన మెరుగుదల పెట్రోల్ స్టేషన్ల సంఖ్యను తగ్గించటానికి దారితీసింది. రోడ్‌సైడ్ అసిస్టెంట్ అసోసియేషన్ ADAC ప్రకారం.. 1965లో 40,640 నుంచి 2020లో పెట్రోల్ స్టేషన్ల సంఖ్య 14,118 కు పడిపోయిందని నివేదిక తెలిపింది.