Gold Rate: బంగారం కొనేవాళ్లకు ఊరట.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. హైదరాబాద్‌లో 10గ్రాముల 22క్యారట్ల ధర ఎంతంటే..?
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది.

Gold
Gold Rate: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వచ్చే వారంరోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్నటువంటి వాణిజ్య చర్చలే కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో అమెరికా, చైనా ట్రేడ్ వార్ తో అంతర్జాతీయంగా మార్కెట్లపై ప్రభావం పడింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడుల కోసం బంగారంవైపు మొగ్గు చూపారు. దీంతో గోల్డ్ రేటు అవకాశమే హద్దుగా దూసుకెళ్లింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతోపాటు.. రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలుసైతం క్రమంగా తగ్గుతుండటంతో రాబోయే కాలంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. అంతర్జాతీయంగా గోల్డ్ రేటు తగ్గింది. బంగారం ఔన్సు (31.10గ్రాముల) 49డాలర్లు తగ్గి 3,277డాలర్లకు చేరింది. భారతదేశంలోనూ గోల్డ్ రేటు తగ్గింది. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.1,800 తగ్గగా, 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 1,650 తగ్గింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 2వేలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.88,800 కాగా.. 24 క్యారట్ల ధర రూ.96,880 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,950 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,030కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 88,800 కాగా.. 24క్యారెట్ల ధర రూ.96,880కు చేరుకుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,09,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.97,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,09,000 వద్ద కొనసాగుతుంది.
Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో పలు దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.