Gold Rate: గోల్డ్ కొంటున్నారా..? ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు పెరిగాయా.. తగ్గాయా.. ఇక్కడ తెలుసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు..

Gold Rate
Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఏదైనా బంగారం కొనుగోళ్లు తప్పనిసరి. గత కొద్దిరోజులు గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. ఇవాళ కూడా గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు (31.10గ్రాముల) ధర ఆదివారం ఉదయం 3,315 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్స్ సిల్వర్ ధర 32.57 డాలర్లుగా ఉంది. ఇక భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10గ్రాముల గోల్డ్ పై రూ. 320 పెరిగింది. వెండి ధరసైతం పెరిగింది. కిలో వెండిపై రూ.402 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.89,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.98,510 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.98,050.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 89,450 కాగా.. 24క్యారెట్ల ధర రూ.98,510 గా నమోదైంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్వల్పంగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,10,000.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,000గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,10,000 వద్ద కొనసాగుతుంది.
Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో పలు దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.