Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్.. రాఖీ పౌర్ణమి వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.

Gold
Gold Rates: ‘రక్షా బంధన్’ తోబుట్టువులకు పవిత్రమైన పండుగ. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు గుర్తుగా రక్షాబంధన్ జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. రాఖీ కట్టిన సోదరీమణులకు కొందరు బంగారం, ఇతర ఖరీదైన వస్తువులను బహుమతిగా ఇస్తూ వారిపై ప్రేమను చాటుకుంటుంటారు. కొద్దిరోజులుగా గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది.. అయితే, తాజాగా.. రాఖీ పౌర్ణమి వేళ గోల్డ్ రేటు తగ్గింది.
Also Read: నేడు రక్షా బంధన్.. ఏ సమయంలో రాఖీ కట్టాలి.. ఆ సమయంలో రాఖీ కట్టడం వల్ల ఏం జరుగుతుంది..?
రాఖీ పౌర్ణ పండుగ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేటు తగ్గింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 270 తగ్గింది.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 250 తగ్గింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 11 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ రేటు 3,398 డాలర్ల వద్ద కొనసాగుతుంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.94,450 చేరగా.. 24 క్యారట్ల ధర రూ.1,03,040కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,600కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,03,190కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.94,600 కాగా.. 24క్యారెట్ల ధర రూ.రూ.1,03,190కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,27,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,17,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,27,00 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.