Gold Rate : మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు.. ఈసారి భారీగానే పెరిగింది.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో

Gold Rate : మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు.. ఈసారి భారీగానే పెరిగింది.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?

Gold

Gold Rate in Hyderabad : బంగారం ధర తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 760 తగ్గగా.. ఆదివారం స్థిరంగా కొనసాగింది. బంగారం ధర తగ్గడంతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వారి సంతోషం రెండు రోజులకే పరిమితమైంది. సోమవారం బంగారం రేటు భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ పై రూ. 600 పెరిగింది. దీంతో తులం గోల్డ్ ధర రూ. 75వేల మార్క్ వైపుకు వేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు వెండి ధరసైతం పెరిగింది. కిలో వెండిపై రూ. 500 పెరిగింది. దీంతో కిలో వెండి ధర ప్రస్తుతం 89,500కు చేరింది.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,050 మార్క్ కు చేరింది. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,150 మార్క్ కు చేరింది.

 

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,200 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,300.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,050 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,150.
    చెన్నైలో మాత్రం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 710 తగ్గింది. దీంతో అక్కడ 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,900 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.74,070.

 

  • పెరిగిన వెండి ధర ..
    దేశ వ్యాప్తంగా వెండి ధర పెరిగింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.89,500 కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 89,500. కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.86,000 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో మాత్రం వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 84,650 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.