Gold Rate : లక్షకు చేరుతుందా? ఒక్కరోజే రూ.900 పెరిగిన గోల్డ్ రేటు.. 90వేలు దాటిన కిలో వెండి ధర..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో

Gold Rate : లక్షకు చేరుతుందా? ఒక్కరోజే రూ.900 పెరిగిన గోల్డ్ రేటు.. 90వేలు దాటిన కిలో వెండి ధర..

Gold

Gold Rate in Hyderabad : గోల్డ్ రేట్లు రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. బంగారం ధర మరోసారి ఆల్ టైం రికార్డుకు చేరింది. తులం బంగారం ధర రూ. 75వేల మార్క్ ను దాటింది. ఇటీవల అమెరికాలో వెలువడిన ద్రవ్వోల్బణ గణాంకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. దీంతో జూన్ నుంచి వడ్డీ రేట్లు తగ్గించ్చునన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాల వేళ పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా బంగారం ధరల దూకుడును చూస్తుంటే ఈ ఏడాది చివరి నాటికి తులం బంగారం రూ.లక్ష దాటే అవకాశాలుకూడా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇవాళ బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 980 పెరిగింది. వెండిధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరగ్గా.. కిలో వెండి ధర రూ. 90వేలు దాటింది.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,950 మార్క్ కు చేరింది. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,130 మార్క్ కు చేరింది.

Gold

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,100 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 74,280.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,950 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 74,130.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,700 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.75,050.

Gold

  • పెరిగిన వెండి ధర ..
    దేశ వ్యాప్తంగా వెండి ధర పెరిగింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.90,500 కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 90,500. కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.87,000 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో మాత్రం వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 84,750 వద్ద కొనసాగుతుంది.

Gold

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.