Gold Rate: భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఇంకా తగ్గుతుందా..? బంగారాన్ని ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా.. నిపుణులు ఏమంటున్నారు..

బంగారం ప్రియులు ఎగిరిగంతేసే వార్త. ఎందుకంటే.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఏప్రిల్ చివరి నాటి వీటి ధరలు..

Gold Rate: భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఇంకా తగ్గుతుందా..? బంగారాన్ని ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా.. నిపుణులు ఏమంటున్నారు..

Gold

Updated On : April 5, 2025 / 7:11 AM IST

Gold And Silver Price Today: బంగారం ప్రియులు ఎగిరిగంతేసే వార్త. ఎందుకంటే.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గతేడాది కాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన గోల్డ్, సిల్వర్ ధరల్లో ఒక్కసారిగా భారీ కుదుపు ఏర్పడుతోంది. దీంతో వీటి ధరలు అమాంతం తగ్గిపోయాయి.

 

రూ. 2400 తగ్గిన గోల్డ్ రేటు..
అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) మేలిమి బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే 80డాలర్లకుపైగా తగ్గింది. ఫలితంగా భారతదేశంలోనూ బంగారం ధరలు తగ్గాయి. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు శుక్రవారం రాత్రి 11గంటల సమయానికి రూ.2400 తగ్గింది. తద్వారా లక్ష వైపు పరుగు తీస్తున్న గోల్డ్ రేటు ఒక్కసారిగా రూ.91వేలకు పడిపోయింది. వెండి ధరసైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై ఒక్కరోజులోనే రూ.8వేలకుపైగా తగ్గింది. రెండు రోజుల్లో రూ.12వేలకుపైగా తగ్గుదల చోటు చేసుకుంది.

 

ధరలు తగ్గడానికి కారణం..?
అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన ధోరణి ధరలు తగ్గడానికి కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉన్నప్పుడు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. అయితే, ధరలు ఇంతగా పెరగడంతో ఆభరణాల విక్రయాలు దాదాపు 70శాతం తగ్గాయి. పాత ఆభరణాల మార్పిడితో కొత్తవి తీసుకోవడం పెరిగిందని విక్రేతలు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై విధించిన టారిఫ్ లు అమల్లోకి వస్తుండగా.. బంగారం గరిష్ఠ ధరలు నిలబడవనే అంచనాతో ఇన్వెస్టర్లు ఈ లోహాల్లోనూ లాభాల స్వీకరణకు దిగినట్లు సమాచారం.

 

గోల్డ్ రేటు ఇంకా తగ్గుతుందా..?
ఏప్రిల్ చివరి నాటికి లేదా మే నెలలో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. రష్యా – యుక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఫలించి యుద్ధం విరమణ చోటుచేసుకుంటే బంగారం ధర మరింతగా దిగొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అత్యవసరం అనుకున్నవారు మినహా మిగిలిన వారు బంగారం కొనుగోలు చేసేముందు అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ, అనువైనప్పుడు గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి కాస్త బలపడటమూ మనకు కలిసొచ్చే అంశమని, రాబోయే కాలంలో బంగారం ధర తగ్గే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.