Gold Prices : బంగారం కిందకు..వెండి పైకి

కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తగ్గుతున్నాయి. మూడు రోజుల తర్వాత పసిడి ధరలు..బుధవారం పెరిగాయి. గత నెలతో పోలిస్తే..రూ. 2 వేలు తగ్గింది. కానీ వెండి ధరలు మాత్రం తగ్గడం లేదు. రూ. 500 పెరిగింది. కిలో వెండి రూ. 48 వేల 500గా ఉంది. ఏపీ రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. దేశీ జువెల్లర్స్, కొనుగోలు దారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పండిందని నిపుణులు పేర్కొంటున్నారు. నాణేపు తయారీ దారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండీ ధర కూడా పైకి ఎగబాకుతోందంటున్నారు.
హైదరాబాద్ మార్కెట్లో 2019, అక్టోబర్ 23వ తేదీ బుధవారం..పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 150 దిగొచ్చింది. 10 గ్రాముల ధర రూ. 39 వేల 800కు పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 150 తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 36 వేల 470కి పడిపోయింది.