Gold Imports: ఏంటి బంగారాన్ని పల్లి, బటానీల్లా కొంటున్నారా?.. ఏకంగా 192 శాతం పెరిగిన గోల్డ్ దిగుమతులు..

ఒకవైపు బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నా.. వాటి కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ఆ స్థాయిలో దేశంలో బంగారం దిగుమతులు పెరుగుతున్నాయి.

Gold Imports: ఏంటి బంగారాన్ని పల్లి, బటానీల్లా కొంటున్నారా?.. ఏకంగా 192 శాతం పెరిగిన గోల్డ్ దిగుమతులు..

Gold

Updated On : April 19, 2025 / 3:22 PM IST

Gold Imports: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనల తరువాత ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు పెరగడంతో గోల్డ్ రేటు రికార్డు స్థాయిలను నమోదు చేస్తూ దూసుకెళ్తోంది. డాలర్ విలువ తగ్గడం, వాణిజ్య యుద్ధం ఉద్రిక్తతలు కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఫలితంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలను నమోదు చేస్తున్నాయి. అయినా, మరో పక్క గోల్డ్ కొనుగోళ్ల జోరు మాత్రం తగ్గడం లేదు.

Also Read: Gold Rate Today: గోల్డ్ ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా..

ఒకవైపు బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నా.. వాటి కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ఆ స్థాయిలో దేశంలో బంగారం దిగుమతులు పెరుగుతున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా మార్చి నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం.. మార్చి నెలలో దేశంలోకి బంగారం దిగమతులు భారీగా పెరిగాయి. ఫిబ్రవరితో పోలిస్తే బంగారం దిగుమతులు విలువ మార్చిలో 192.13శాతం పెరిగి 4.47 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.38వేల కోట్లు.

 

చైనా తరువాత భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది. దేశంలోకి దిగుమతి అయ్యే మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 8శాతం. టన్నుల్లో లెక్కన దిగుమతుల వివరాలు పరిశీలిస్తే.. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 785.32 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా.. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 757.15 టన్నులకు తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 62శాతం మేర బంగారం దిగుమతులు తగగ్గా.. జనవరిలో 48.8 శాతం, 2024 డిసెంబర్ నెలలో 55.39 శాతం మేర దిగుమతులు పెరిగాయి.

 

భారతదేశం దిగుమతి చేసుకుంటున్న బంగారంలో మెజార్టీ వాటా స్విట్జర్లాండ్ దేశానిదే. ఆ దేశం నుంచి 40శాతం బంగారం దిగుమతి అవుతుంది. యూఏఈ 16శాతం, దక్షిణాఫ్రికా 10శాతంతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక వెడి దిగుమతులు మాత్రం 85శాతం మేర తగ్గి 119.3మిలియన్ డాలర్లుగా నమోదైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11.24శాతం మేర వెండి దిగుమతులు తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.