మళ్లీ పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా, చైనాల మధ్య ఒప్పందంలో అనిశ్చితి కారణంగా రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఫలితంగా రెండు నెలల క్రితం విలువకు పడిపోయింది. సెన్సెక్స్ 170పాయింట్ల లాభంతో ముగియగా రూపాయి 12పైసలు లాభానికి 71.97 డాలర్ల వద్ద ముగిసింది.
నవంబరు 15 శుక్రవారం పది గ్రాముల బంగారం ధర గురువారం ధరలతో పోలిస్తే 300 రూపాయల వరకూ పెరిగిపోయింది. వెండి ధరలు కూడా కేజీకి 70 రూపాయల వరకూ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 300 రూపాయలు పెరిగి 39వేల 940రూపాయలకు చేరింది.
పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 280 రూపాయలు పెరిగి 36వేల 620 రూపాయలకు చేరింది. వెండి ధరలోనూ భారీగా మార్పులు వచ్చాయి. కేజీ వెండి ధర 70 రూపాయలు పెరిగి 48వేల 840 రూపాయలకు చేరింది.