కొండెక్కిన బంగారం ధరలు.. 10గ్రాములు 51,460రూపాయలు

ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, ఛార్జీలు వసూలు చేయడం వల్ల భారతదేశం అంతటా బంగారు ఆభరణాల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత మార్కెట్‌లో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 470 పెరిగి రూ. 51,460కి చేరుకుంది.
ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 1,880 పెరిగి రూ. 51,900కి చేరుకోగా.. న్యూఢిల్లీలో బంగారం ధర రూ. 50,184గా, ముంబైలో రూ. 49,239గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి అధికంగా ఉండటం.. ఇన్వెస్టర్లు ఎక్కువగా డబ్బులు బంగారంపై పెట్టడం బంగారం ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు.
ఇదిలావుండగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,800 డాలర్లకు చేరుకోగా, వెండి ధర 18 డాలర్లను మించిపోయింది. బంగారం ధరల పెరుగుదల మరికొంతకాలం కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో త్వరలో శ్రావణ మాసం ప్రారంభం కానుండగా.. కొనుగోళ్లు పెరగొచ్చునని సమాచారం.
Read Here>>ప్రధాన్ మంత్రి ఉజ్జ్వల యోజన: సెప్టెంబర్ వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు