Gold Rates Dropped : తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే సమయానికి రికార్డైన ధరతో పోలిస్తే ధర భారీగా పడిపోయింది.

Gold Rates Dropped : తగ్గిన బంగారం ధరలు

Gold Rates

Updated On : September 20, 2021 / 2:00 PM IST

Gold Rates Dropped : హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే సమయానికి రికార్డైన ధరతో పోలిస్తే ధర భారీగా పడిపోయింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,500లకు చేరుకుంది. పది రోజుల క్రితం సెప్టెంబరు 11న ఇదే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,070లుగా ఉంది. ఈ పది రోజుల్లో బంగారం ధర దాదాపుగా రూ. 600ల వరకు తగ్గింది.

Also Read : Gold Rate: బంగారం ధరల్లో ఆరు నెలలుగా భారీ పతనం
ఇక పెట్టుబడిగా ఉపయోగించే 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,000లకి పడిపోయింది. సెప్టెంబరు 11న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,070గా ట్రేడ్‌ అయ్యింది. తాజాగా తగ్గిన ధరలతో హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్‌ బంగారం ధర రూ. 43,400లకి చేరుకుంది.  గతేడాది ఆగస్టులో హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.54,200 దగ్గర ట్రేడ్‌ అయ్యింది. ఆ ధరతో పోల్చితే ప్రస్తుతం రూ. 11 వేల వరకు బంగారం ధర తగ్గినట్టయ్యింది. ప్యూచర్‌ గోల్డ్‌కి సంబంధించి ఈ వత్యాసం రూ. 10,900లుగా ఉంది. తాజాగా తగ్గిన ధరలతో బంగారం ధరలు చూస్తే ఆరు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.

వెండి ధరకూడా తగ్గింది
మరోవైపు వెండి రేటు కూడా భారీగా తగ్గింది. 2020 ఆగస్ట్ 7న కిలో వెండి ధర రూ.76,150లుగా ఉండగా ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.63,500గా ట్రేడ్‌ అవుతోంది. గరిష్ట ధర నుంచి సుమారు రూ.12,650 వరకు వెండి ధర తగ్గింది.

అంతర్జాయ మార్కెట్‌లో సైతం ఇదే ధోరణి
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలరుతో బంగారం మారకం విలువ 0.1 శాతం పడిపోయింది. దీంతో గ్లోబల్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1752.66 డాలర్లుగా ఉండగా ఫ్యూచర్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 1753.80 డాలర్లుగా నమోదు అవుతోంది.