Gold Rates Today : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌.. ఏపీ, తెలంగాణలో 10గ్రాముల గోల్డ్ రేటు ఎంతో తెలుసా..?

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.

Gold Rates Today : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌.. ఏపీ, తెలంగాణలో 10గ్రాముల గోల్డ్ రేటు ఎంతో తెలుసా..?

Gold Rates Today

Updated On : September 17, 2025 / 12:19 PM IST

Gold Rates Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి స్వల్ప ఊరట. ఇవాళ బంగారం రేటు తగ్గింది. గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు.. సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. అయితే, తాజాగా.. బంగారం ధర తగ్గడంతో గోల్డ్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 220 తగ్గగా.. 10గ్రాముల 22 క్యారట్ల బంగారంపై రూ. 200 తగ్గింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై ఏడు డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 3,681 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
మరోవైపు భారతదేశంలో వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 2వేలు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,02,400 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,11,710కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,550 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,11,860కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,02,400 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,11,710కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,42,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,32,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,42,000కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Also Read: Indian Railways : రైల్వే ప్రయాణికులకు బిగ్‌అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్.. ఆధార్ ధ్రువీకరణ ఉన్నవారికే..