Gold Forecast: బంగారం ధర భారీగా పెరుగుతుందా? పెరిగే ఛాన్స్‌ ఉంది.. ఎందుకంటే?

బుధవారం ఆసియా సెషన్‌లో బంగారం ధర ఔన్సుకి $2,900కి పైగా కొనసాగింది.

Gold Forecast: బంగారం ధర భారీగా పెరుగుతుందా? పెరిగే ఛాన్స్‌ ఉంది.. ఎందుకంటే?

Updated On : March 12, 2025 / 3:24 PM IST

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధర అంతర్జాతీయంగా ఔన్సుకు 2,900 డాలర్ల వద్ద స్థిరంగా ఉంటుందా? లేదా భారీగా పెరుగుతుందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

బుధవారం ఆసియా సెషన్‌లో బంగారం ధర ఔన్సుకి $2,900కి పైగా కొనసాగింది. ఇది వారాంతపు గరిష్ఠ స్థాయులకు దగ్గరకు ఉంది. పెట్టుబడిదారులు అమెరికా వాణిజ్య విధానాలు అలాగే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై దృష్టిపెట్టారు. బంగారం ధరలు వీటిపై ఆధారపడి ఉంటాయి.

ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ పెరుగుతున్నప్పటికీ, ఫెడరల్ రిజర్వ్ ఈ సంవత్సరంలో 0.25% వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముండడంతో ప్రస్తుతమైతే బంగారం డిమాండ్ స్థిరంగా ఉంది.

Also Read: కళ్లుమూసి తెరిచేలోపు ఏడాది గడచిపోయింది.. మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే..: వైఎస్ జగన్

ఒక సీనియర్ నిపుణుడు దీని గురించి మాట్లాడుతూ.. అమెరికా సుంకాల (దిగుమతి పన్నులు) గురించి అనిశ్చితి ఉండడం, అవి ప్రపంచ వాణిజ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయోనన్న భయం పెట్టుబడిదారుల్లో నెలకొందన్నారు.

దీంతో చాలా మంది పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ అనిశ్చితంగా ఉన్నప్పుడు, ప్రజలు తరచూ బంగారాన్ని కొనుగోలు చేస్తారని అన్నారు.

అమెరికా ద్రవ్యోల్బణం (సీపీఐ) డేటాను విడుదల చేయాల్సి ఉన్న వేళ డాలర్ తిరిగి పంజుకుంటోంది. ఇంతకుముందు కొన్ని నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. ద్రవ్యోల్బణ నివేదికలో కోసం వ్యాపారులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెంచాయి. దీంతో ధరలు పెరుగుతున్నాయి.

ఇక వెండి ధర ట్రాయ్‌ ఔన్స్‌కు $32.80 వద్ద ట్రేడ్ అవుతుండగా, ఇన్‌ట్రాడే కనిష్ఠ స్థాయి $32.73 కంటే కొంత ఎక్కువగా ఉంది. అమెరికా డాలర్ పుంజుకోవడంతో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, ఫెడరల్ రిజర్వ్ విధానం సడలించే అవకాశం ఉండడంతో సిల్వర్‌ డిమాండ్‌ కూడా బాగానే ఉంది.