Smart TV Android 15 : మీ స్మార్ట్‌టీవీల్లో ఆండ్రాయిడ్ 15 రావడం లేదు.. గూగుల్ ఏం చెబుతుందంటే?

Smart TV Android 15 : ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం.. స్మార్ట్‌టీవీలకు ద్వై-వార్షిక ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ గూగుల్ అందించనుంది. ఈ మార్పులతో ఆండ్రాయిడ్ టీవీ బిగ్ స్క్రీన్లలో వెర్షన్ 15ని అందించే అవకాశం లేదు.

Smart TV Android 15 : మీ స్మార్ట్‌టీవీల్లో ఆండ్రాయిడ్ 15 రావడం లేదు.. గూగుల్ ఏం చెబుతుందంటే?

Google Says Your Smart TV Will Not Get Upgraded To Android

Updated On : November 8, 2024 / 10:31 PM IST

Smart TV Android 15 : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ టీవీలలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసే విధానాన్ని మారుస్తోంది. చాలామంది స్మార్ట్‌టీవీ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ల మాదిరిగా కొత్త టీవీలపై పెట్టుబడి పెట్టరని కంపెనీ గ్రహించింది. ప్రతి ఏడాదిలో కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌లను రిలీజ్ చేయడం అత్యంత ఖరీదైనదిగా భావించింది.

ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం.. స్మార్ట్‌టీవీలకు ద్వై-వార్షిక ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ గూగుల్ అందించనుంది. ఈ మార్పులతో ఆండ్రాయిడ్ టీవీ వినియోగదారులు బిగ్ స్క్రీన్ల కోసం వెర్షన్ 15ని అందించే అవకాశం లేదు. దానికి బదులుగా, 2026లో రిలీజ్ కానున్న ఈ టీవీల కోసం నేరుగా ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌కి అందించాలని గూగుల్ యోచిస్తోంది.

స్మార్ట్‌టీవీల్లో ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు నిజంగా అవసరమా?
ఈ మార్కెట్‌లోని చాలా ఆండ్రాయిడ్ టీవీలు బ్రాండ్‌ల నుంచి నెమ్మదిగా అప్‌డేట్స్ అందుకోనున్నాయి. ఈ స్మార్ట్‌టీవీలు హ్యాక్ అవ్వడం లేదా డేటా దొంగిలించే ప్రమాదం లేదనే చెప్పవచ్చు. దానికి తోడు, వినియోగదారులు తమ టీవీలను దీర్ఘకాలిక పెట్టుబడిగా కొనుగోలు చేస్తున్నారు. ఆదర్శంగా 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉంటాయి.

ఈ స్మార్ట్‌టీవీలకు 3-4 ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లను అందించనుంది. ఈ స్మార్ట్ డివైజ్‌లకు అవసరమయ్యే సెక్యూరిటీ అప్‌డేట్స్ క్రమం తప్పకుండా పొందాల్సి ఉంటుంది. మీరు పాత వెర్షన్‌లలో రన్ అవుతున్న స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని ఉపయోగిస్తుంటే.. లేటెస్ట్ అప్‌డేట్‌ కోసం వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.

Read Also : Vivo X200 Series Launch : వివో ఎక్స్200 సిరీస్ వచ్చేస్తోంది.. అప్‌కమింగ్ సిరీస్ గ్లోబల్ లాంచ్ ఎప్పుడంటే?