నోయిడాలో Honda Cars ఉత్పత్తి నిలిపివేత

నోయిడాలో Honda Cars ఉత్పత్తి నిలిపివేత

Updated On : December 19, 2020 / 8:49 PM IST

Honda Cars Greater Noida plant : ప్రముఖ కార్ల తయారీ కంపెనీలో హోండా కంపెనీ ఒకటి. పలు రాష్ట్రాల్లో ప్లాంట్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. గ్రేటర్ నోయిడాలో కూడా దీనికి సంబంధించిన ప్లాంట్ ఉంది. అయితే..అనూహ్యంగా..ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేసింది. కార్ల ఉత్పత్తి మొత్తం రాజస్థాన్ రాష్ట్రంలోని తపుకరాలో మాత్రమే జరగనుంది. నొయిడాలో కంపెనీ కార్పొరేట్ హెడ్ ఆఫీసుతో పాటు..స్పేర్ పార్ట్స్ డివిజన్, రీసెర్చి అండ్ డెవలప్ మెంట్ కేంద్రం, ఇతర కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతాయని సమాచారం.

మూసివేత నిర్ణయంపై స్పందించేందుకు కంపెనీ నిరాకరించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ నోయిడాలో Honda City, Honda CR-V and Honda Civic మోడళ్లు ఉత్పత్తి అయ్యేవి. ఈ ప్లాంట్ సామర్థ్యం లక్ష యూనిట్లు. తపుకరలో ఉన్న ప్లాంట్ సామర్థ్యం 1.8 లక్ష యూనిట్లు. గత సంవత్సరం నవంబర్ నెలలో 6 వేల 459 వాహనాలు మాత్రమే విక్రయించింది. ఈ ఏడాది నవంబర్‌లో 9 వేల 900 యూనిట్లు విక్రయించడం విశేషం. అతి పెద్ద ఆటో మొబైల్ తయారీదారుల్లో ఒకటైన హోండా కార్స్ ఇండియా డిసెంబర్ 1995లో స్థాపించారు.