Honda Elevate Bookings : కొత్త కారు కావాలా? హోండా ఎలివేట్ బుకింగ్స్ ఓపెన్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి.. సెప్టెంబర్‌లోనే లాంచ్!

Honda Elevate Bookings : పండుగ సీజన్‌కు ముందు వచ్చే సెప్టెంబర్‌లో హోండా ఎలివేట్ లాంచ్ కానుంది. హోండా కొత్త SUVని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Honda Elevate Bookings : కొత్త కారు కావాలా? హోండా ఎలివేట్ బుకింగ్స్ ఓపెన్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి.. సెప్టెంబర్‌లోనే లాంచ్!

Honda Elevate bookings open officially, launch in September

Honda Elevate Bookings : ప్రముఖ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) కొత్త మిడ్-సైజ్ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (SUV) ఎలివేట్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభించింది. కొత్త ఎలివేట్ కారు రూ. 21,000 టోకెన్ మొత్తానికి బుకింగ్‌ చేసుకోవచ్చు. ఎలివేట్‌ను కార్‌మేకర్ డీలర్‌షిప్‌లు లేదా ‘Honda from Home’ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. హోండా ఎలివేట్ సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అదే నెలలో ఎలివేట్ కారు డెలివరీలు కూడా ప్రారంభమవుతాయి. థాయ్‌లాండ్‌లోని హోండా R&D ఆసియా పసిఫిక్‌లో అభివృద్ధి చేసిన ఈ గ్లోబల్ మిడ్-సైజ్ SUVని ప్రవేశపెట్టిన మొదటి దేశంగా భారత్ నిలువనుంది.

హోండా కొత్త SUVని 2023 పండుగ సీజన్‌కు ముందు లాంచ్ చేయనున్నట్లు నివేదిక వెల్లడించింది. హోండా ఎలివేట్ 1.5-లీటర్ i-VTEC DOHC పెట్రోల్ ఇంజన్ ఉంది. గరిష్టంగా 121PS పవర్, 145Nm గరిష్ట టార్క్‌ని అందిస్తుంది. ఇంజిన్‌ను 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ CVT ఆటోమేటిక్‌తో పెయిర్ చేయవచ్చు. SV, V, VX, ZX అనే 4 వేరియంట్‌లు ఉన్నప్పటికీ, CVT ఆప్షన్ V, VX, ZXలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. MT ఆప్షన్ కోసం వెళ్లే కొనుగోలుదారులు మొత్తం 4 వేరియంట్‌ల నుంచి ఎంచుకోవచ్చు.

Read Also : Svitch Bike Experience Centre : హైదరాబాద్‌‌కు ‘స్విచ్ బైక్’ రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ వచ్చేసిందోచ్..!

హోండా ఎలివేట్ LED DRLలు, LED టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఫుల్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు, 17-అంగుళాల డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్ (కొత్త), అబ్సిడియన్ బ్లూ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్, మెటిరాయిడ్ గ్రే మెటాలిక్ ఉన్నాయి. క్యాబిన్‌లో 7-అంగుళాల HD కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల IPS HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, బ్రౌన్ లెథెరెట్ అప్హోల్స్టరీ, డాష్, డోర్ ట్రిమ్‌లపై సాఫ్ట్-టచ్ ప్యాడ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

Honda Elevate bookings open officially, launch in September

Honda Elevate bookings open officially, launch in September

ఎలివేట్ కారులో సెగ్మెంట్-లీడింగ్ 458-లీటర్ బూట్‌ను కలిగి ఉంది. ఎలివేట్‌తో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీ హోండా సెన్సింగ్‌ను కార్‌మేకర్ అందిస్తోంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ వాచ్ కెమెరా, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ విత్ ఎజైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, మల్టీ-యాంగిల్ రియర్ వ్యూ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఇతర భద్రతా ఫీచర్లు ఉన్నాయి. హోండా ఎలివేట్ ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 18 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ 2023, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌లకు పోటీగా భారత మార్కెట్లోకి రానుంది.

Read Also : Honda Elevate Bookings : హోండా ఎలివేట్ బుకింగ్స్ చేసుకున్నారా? మీ బుకింగ్ రద్దు చేస్తే.. 100 శాతం రీఫండ్ గ్యారెంటీ..!