ఫేస్‌బుక్ Appలో Page పోస్టు Drafts ఎలా గుర్తించాలి!

మీకు ఫేస్ బుక్ పేజీ ఉందా? మీ పేజీలో పోస్టులు క్రియేట్ చేస్తున్నారా? మీ FB పేజీలో పోస్టులను సేవ్ చేయొచ్చు. Publishing tools menu ద్వారా పోస్టులను Draftsలో ఎడిట్ కూడా చేయొచ్చు. అయితే చాలామంది తమ పేజీలను డెస్క్ టాప్ వెర్షన్ ఫేస్ బుక్ లోనే ఎక్కువగా ఆపరేట్ చేస్తుంటారు. అదే మొబైల్ వెర్షన్ ఆండ్రాయిడ్ డివైజ్ లో అదే ఫేస్ బుక్ పేజీని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసా? అంటే.. మీరు పోస్టు చేసిన పోస్టులను సేవ్ చేయగానే అది Draftsలోకి వెళ్లిపోతాయి.
ఆయా పోస్టులను డెస్క్ టాప్ వెర్షన్ అయితే ఈజీగా గుర్తించవచ్చు. మరి మొబైల్ వెర్షన్ వచ్చే సరికి కాస్తా డిఫరెంట్ గా ఉంటుంది. Drafts మెనూ ఎక్కడి ఉంది.. అందులోని పోస్టులను ఎడిట్ చేయాలి.. పోస్టు చేయాలా లేదా డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు.
ఇందుకు మీరు ఆ పేజీలో అడ్మిన్ గానీ లేదా ఎడిటర్ గా అని పర్మిషన్ ఉండాలి. పేజీలోని Page Role లో మీకు ఇచ్చిన మోడరేషన్ బట్టి మీకు ఆయా సెట్టింగ్స్ కనిపిస్తాయి. ఆండ్రాయిడ్ మొబైల్లోని ఫేస్ బుక్ యాప్ ద్వారా Drafts పోస్టులను గుర్తించి ఎడిట్ చేయడం లేదా పబ్లీష్ చేయాలంటే ఈ కింది విధంగా ఫాలో అవ్వండి..
* ఆండ్రాయిడ్ డివైజ్ లో Facebook app ఓపెన్ చేయండి.
* మీ ఫేస్ బుక్ అకౌంట్లో Login అవ్వండి.
* టాప్ రైట్ కార్నర్‌లో (===) కనిపించే మూడు వర్టికల్ గీతలపై Tap చేయండి.
* మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక ఆప్షన్ల List కనిపిస్తుంది.
* అక్కడ Pages అనే ఆప్షన్ దగ్గర Tap చేయండి.
* మీ అకౌంట్లో ఎన్ని పేజీలు యాక్సస్ ఉంటే అన్ని పేజీలు కనిపిస్తాయి.
* మీరు ఏ పేజీని యాక్సస్ చేయాలో దానిపై క్లిక్ చేయండి.
* టాప్ రైట్ కార్నర్‌లో (===) కనిపించే మూడు వర్టికల్ గీతలపై Tap చేయండి.
* ఇక్కడ మీకు Drafts (పెన్ ఐకాన్) అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
* Drafts ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీకు Post Now, Delete అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
* ఇందులో Delete ఆప్షన్ ఎంచుకోండి.. మీకు Delete అనే ప్రాంఫ్ట్ మెసేజ్ కనిపిస్తుంది.
* Deleteపై పోస్టు చేస్తే.. అది డిలీట్ అయిపోతుంది.
* ఒకవేళ Post Now ఆప్షన్ ఎంచుకుంటే పోస్టు పబ్లీష్ అవుతుంది.