Income Tax Slabs 2024-25 : ప‌న్ను చెల్లింపుదారుల‌కు అల‌ర్ట్‌.. కొత్త పన్ను విధానంలో మార్పులు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Income Tax Slabs 2024-25 : ప‌న్ను చెల్లింపుదారుల‌కు అల‌ర్ట్‌..  కొత్త పన్ను విధానంలో మార్పులు..

New Tax Rate Structure : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు, వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్‌ను రూపొందించామ‌న్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన- నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన- ఆవిష్కరణలు, తయారీ-సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు చెప్పారు.

ఈ బ‌డ్జెట్‌లో ఉద్యోగుల‌కు స్వ‌ల్ప ఊరట మాత్ర‌మే ల‌భించింది. కొత్త పన్ను విధానంలో స్వ‌ల్ప మార్పుల‌తో పాటు స్టాండ‌ర్ట్ డిక్ష‌న్ విష‌యంలో కొంత ఊర‌ట ల‌భించింది. స్టాండ‌ర్ట్ డిడ‌క్ష‌న్ ప్ర‌స్తుతం రూ.50 వేలు ఉండ‌గా ఆ మొత్తాన్ని రూ.75వేల‌కు పెంచారు. దీంతో ప‌న్ను చెల్లింపు దారులు రూ.17,500 వ‌ర‌కు ఆదా చేసుకోవ‌చ్చున‌ని కేంద్ర మంత్రి వెల్ల‌డించారు.

కేంద్ర బడ్జెట్లో బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. ఏఏ వస్తువుల ధరలు తగ్గబోతున్నాయో తెలుసా..

కొత్త ప‌న్ను విధానంలో రూ.3ల‌క్ష‌ల వ‌ర‌కు ఎలాంటి మార్పు లేదు. గ‌తంలో రూ.3ల‌క్ష‌ల నుంచి 6 ల‌క్ష‌ల వ‌ర‌కు శ్లాబులో 5 శాతం ప‌న్ను ఉండ‌గా.. ఇప్పుడు ఆ ప‌రిమితిని రూ.7ల‌క్ష‌ల‌కు పెంచారు. రూ.6ల‌క్ష‌ల నుంచి రూ.9ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్న శ్లాబును రూ.7ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు మారింది.

కొత్త శ్లాబులు..

– మూడు లక్షల ఆదాయం వరకు పన్ను లేదు
– రూ.3ల‌క్ష‌ల నుంచి 7 లక్షల ఆదాయం వరకు 5 శాతం పన్ను


– రూ.7ల‌క్ష‌ల నుంచి 10 లక్షల ఆదాయం వరకు 10 శాతం పన్ను
– రూ.10 ల‌క్ష‌ల నుంచి 12 లక్షల ఆదాయం వరకు 15శాతం పన్ను


– రూ.12ల‌క్ష‌ల నుంచి రూ.15 ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు 20 శాతం ప‌న్ను
– రూ.15 లక్షల ఆదాయం ఆపై ఉంటే 30 శాతం పన్ను

ఇదిలా ఉంటే.. పాత ప‌న్ను విధానంలో ఎలాంటి మార్పు లేదు.
– రూ.2.5ల‌క్ష‌ల వ‌ర‌కు ఎలాంటి ప‌న్ను లేదు
– రూ.2.5ల‌క్ష‌ల నుంచి రూ.5ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు 5 శాతం ప‌న్ను
– రూ.5ల‌క్ష‌ల నుంచి రూ.10ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు 20 శాతం ప‌న్ను
– రూ.10ల‌క్ష‌ల ఆదాయం పైన ఉంటే 30 శాతం ప‌న్ను.