జేబుకు చిల్లు : మళ్లీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు

మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పైకి ఎగబాకుతున్నాయి. దీంతో వాహనదారుల జేబుకు చిల్లు పడుతోంది. తగ్గుముఖం పడుతాయని అనుకున్నా..అలా కావడం లేదు.
ఇప్పటికే పెరిగిపోతున్న ధరలకు తోడు..చమురు ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు రెండో రోజు 2019, డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం కొనసాగింది.
పెట్రల్ ధర లీటర్‌కు 6 పైసలు, డీజిల్ ధర 15 నుంచి 16 పైసలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 74.74 ఉంటే..డీజిల్ ధర రూ. 67.24కు చేరుకుంది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా ధరలు పెరిగాయి. పలు ప్రాంతాల్లో రూ. 80కి చేరుకుంది.
నగరం | పెట్రోల్ (లీటర్) | డీజిల్ (లీటర్) |
న్యూఢిల్లీ | రూ. 74.74 | రూ. 67.24 |
కోల్ కతా | రూ. 77.40 | రూ. 69.66 |
ముంబై | రూ. 80.40 | రూ. 70.55 |
చెన్నై | రూ. 77.70 | రూ. 71.09 |
బెంగళూరు | రూ. 77.30 | రూ. 69.53 |
హైదరాబాద్ | రూ. 79.53 | రూ. 73.37 |
ఆదిలాబాద్ | రూ. 81.11 | రూ. 74.83 |
కామారెడ్డి | రూ. 79.05 | రూ. 73.29 |
ఖమ్మం | రూ. 79.38 | రూ. 73.21 |
మెదక్ | రూ. 80.04 | రూ. 74.13 |
అనంతపురం | రూ. 79.96 | రూ. 73.42 |
చిత్తూరు | రూ. 80.01 | రూ. 73.39 |
కడప | రూ. 78.54 | రూ. 72.08 |
ఈస్ట్ గోదావరి | రూ. 78.86 | రూ. 72.39 |
విశాఖపట్టణం | రూ. 78.12 | రూ. 71.66 |
విజయనగరం | రూ. 78.59 | రూ. 72.10 |
Read More : ఆందోళనలు.. సీఎం ఆదేశాలు.. ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఆపేశారు