Infinix Smart 8 HD Launch : భారీ బ్యాటరీతో ఇన్పినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే..!

Infinix Smart 8 Launch : ఇన్పినిక్స్ నుంచి సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ వచ్చేసింది. భారీ బ్యాటరీతో ఇన్పినిక్స్ స్మార్ట్ 8 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Infinix Smart 8 HD Launch : భారీ బ్యాటరీతో ఇన్పినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే..!

Infinix Smart 8 HD With 5,000mAh Battery, Unisoc T606 SoC Launched in India

Updated On : December 8, 2023 / 4:23 PM IST

Infinix Smart 8 Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అదే.. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్. ఈ కొత్త ఫోన్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్‌డీకి ఫాలో-అప్‌గా డిసెంబర్ 8 (శుక్రవారం) భారత్‌లో లాంచ్ అయింది. ఈ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

సింగిల్ 3జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ యానిమేషన్‌లు, నోటిఫికేషన్‌లను చూపే డిస్‌ప్లేలో పిల్ ఆకారపు మ్యాజిక్ రింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ యూనిసోక్ టీ606 ఎస్ఓసీపై రన్ అవుతుంది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీకి సపోర్టు అందిస్తుంది. 13ఎంపీ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ఏఐ సపోర్టుతో డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Read Also : Flipkart Year End Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2023.. ఐఫోన్ 14, రెడ్‌మి 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ డీల్స్ మిస్ చేసుకోవద్దు!

భారత్‌లో ఇన్పినిక్స్ స్మార్ట్ 8 ధర ఎంతంటే? :
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ ఫోన్ సింగిల్ 3జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 5,669కు పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. క్రిస్టల్ గ్రీన్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం అమెజాన్ ద్వారా రూ. 7,990కు అందుబాటులో ఉంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్‌డీ ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ అయింది. సింగిల్ 2జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ ధర రూ. 5,999కు కొనుగోలు చేయొచ్చు.

Infinix Smart 8 HD With 5,000mAh Battery, Unisoc T606 SoC Launched in India

Infinix Smart 8 HD Launched in India

ఇన్పినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ స్పెసిఫికేషన్‌లు :
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) ఆధారిత ఎక్స్ఓఎస్ 13పై రన్ అవుతుంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల హెచ్‌డీ ప్లస్ (720×1,612 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ పైభాగంలో హోల్ పంచ్ కటౌట్ కూడా ఉంది. ఈ స్క్రీన్ గరిష్ట ప్రకాశాన్ని 500నిట్‌ల వరకు అందిస్తుంది. ఇన్ఫినిక్స్ కొత్త హ్యాండ్‌సెట్‌లో మ్యాజిక్ రింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఫీచర్‌ను చేర్చింది.

నాచ్ చుట్టూ ఉన్న ఈ పిల్ ఆకారపు యానిమేషన్ ఛార్జింగ్ యానిమేషన్‌లు, బ్యాక్‌గ్రౌండ్ కాల్‌లు, తక్కువ బ్యాటరీ రిమైండర్‌లు, ఇతర నోటిఫికేషన్‌లను ప్రదర్శిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 3జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజీతో పాటు ఆక్టా-కోర్ యూనిసోక్ టీ606 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. స్టోరేజ్‌తో మెమరీని 6జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆన్‌బోర్డ్ స్టోరేజీని మైక్రో ఎస్‌డీ కార్డ్ (2టీబీ వరకు) ద్వారా విస్తరించవచ్చు.

Infinix Smart 8 HD With 5,000mAh Battery, Unisoc T606 SoC Launched in India

Infinix Smart 8 HD  

ఇన్పినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ 13ఎంపీ ప్రైమరీ సెన్సార్, రింగ్ ఫ్లాష్‌తో పాటు ఏఐ లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్ కోసం ఫ్లాష్‌తో కూడిన 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇన్పినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

ఈ హ్యాండ్‌సెట్ బయోమెట్రిక్ అన్‌లాకింగ్ కోసం ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ‌లో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 39 గంటల కాలింగ్ సమయం, గరిష్టంగా 50 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్, 36 రోజుల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.

Read Also : Best Phones in India : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ డిసెంబర్‌లో రూ.50 వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!