iPhone 16 Price : ఆపిల్ ఫ్యాన్స్ మీకోసమే.. ఐఫోన్ 16 ధర ఎంత తగ్గిందో తెలుసా? కొంటే ఇప్పుడే కొనుక్కోండి..!
iPhone 16 Price : ఆపిల్ ఐఫోన్ 16 ధర తగ్గిందోచ్.. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

iPhone 16 Price : ఆపిల్ లవర్స్ పండగ చేస్కోండి. ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్ ముగిసనప్పటికీ కూడా ఐఫోన్లపై డీల్స్ ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. గత ఏడాదిలో లాంచ్ అయిన ఐఫోన్ 16 మోడల్ ఇప్పుడు విజయ్ సేల్స్‌లో భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది.

ఆపిల్ ఫ్యాన్స్‌కు అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్ అని చెప్పొచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీరు కూడా ఐఫోన్ 16 కొనాలని చూస్తుంటే ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ధర తగ్గింపు : భారత మార్కెట్లో మొదట రూ.79,900కి లాంచ్ అయిన ఐఫోన్ 16 ఇప్పుడు విజయ్ సేల్స్‌లో కేవలం రూ.66,490కి అందుబాటులో ఉంది. అంటే.. రూ.13,410 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కస్టమర్‌లు రూ.10వేల వరకు ఈఎంఐ లావాదేవీలపై అదనంగా 5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

తద్వారా ధర రూ.56,490కి తగ్గుతుంది. మొత్తం మీద రూ.23,410 సేవ్ చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఫైనల్ ధర కన్నా ఇంకా ఎక్కువ డిస్కౌంట్ పొందొచ్చు.

ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఐఫోన్ 16 బేస్ వేరియంట్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. అల్ట్రామెరైన్, టీల్, బ్లాక్, వైట్, పింక్ అనే 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. సూర్యకాంతిలో కూడా డిస్‌ప్లే అద్భుతంగా కనిపిస్తుంది.

ఆపిల్ A18 ప్రాసెసర్, iOS26లో రన్ అవుతుంది. కెమెరా ఫ్రంట్ సైడ్ ఐఫోన్ 16 మోడల్ 48MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ కలిగి ఉంది. సెల్ఫీలు, ఫేస్‌టైమ్ కాల్స్ 12MP ఫ్రంట్ కెమెరా ద్వారా అందిస్తుంది. ఈ ఐఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 3561mAh బ్యాటరీని అందిస్తుంది.
