iQOO Z6 Lite 5G Price : రూ.15వేల లోపు ధరకే iQOO 5G బడ్జెట్ ఫోన్.. ఇండియాలో సేల్ ఎప్పుడంటే? డేట్ & టైమ్ రాసి పెట్టుకోండి..!

iQOO Z6 Lite In India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (iQOO) ఐక్యూ నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ (iQOO Z6 Lite 5G) అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది.

iQOO Z6 Lite 5G Price : రూ.15వేల లోపు ధరకే iQOO 5G బడ్జెట్ ఫోన్.. ఇండియాలో సేల్ ఎప్పుడంటే? డేట్ & టైమ్ రాసి పెట్టుకోండి..!

iQOO Z6 Lite launched in India : A 5G phone priced under Rs 15,000

Updated On : September 12, 2022 / 9:12 PM IST

iQOO Z6 Lite In India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (iQOO) ఐక్యూ నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ (iQOO Z6 Lite 5G) అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. iQOO కంపెనీ తమ Z6 Lite 5G బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధరను రూ.15వేల లోపు ధరకే అందించనున్నట్టు ప్రకటించింది. Qualcomm కొత్త Snapdragon 4 Gen 1 SoCతో వచ్చిన మొదటి iQOO బడ్జెట్ ఫోన్ ఇదే. 5,000mAh భారీ బ్యాటరీతో పాటు 120Hz స్క్రీన్ వంటి మరెన్నో ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.

iQOO Z6 5G స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవాలంటే.. SBI బ్యాంక్ కార్డ్ (SBI Bank Card) ద్వారా రూ.12,000 కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. iQOO Z6 Lite (4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్) ప్రారంభ ధర రూ. 13,999గా ఉంది. ఇదే డివైజ్ మరో వేరియంట్‌లో కంపెనీ విక్రయిస్తోంది.

iQOO Z6 Lite launched in India_ A 5G phone priced under Rs 15,000

iQOO Z6 Lite launched in India_ A 5G phone priced under Rs 15,000

6GB RAM + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ రూ. 15,499 అవుతుంది. స్టెల్లార్ గ్రీన్, మిస్టిక్ నైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. లాంచ్‌లో భాగంగా, iQOO Z6 Lite లిమిటెడ్-పిరియడ్ ఆఫర్ కింద రూ.11,499 ధరకు అందుబాటులో ఉండనుంది. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్ SBI బ్యాంక్ కార్డ్‌లపై మాత్రమే వర్తిస్తుంది.

అదేవిధంగా, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999లకు పొందవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart Sale) ద్వారా సెప్టెంబర్ 14న సేల్ నిర్వహించనుంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ కొత్త 5G ఫోన్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్‌తో రానుంది.

iQOO Z6 Lite launched in India : A 5G phone priced under Rs 15,000

iQOO Z6 Lite launched in India : A 5G phone priced under Rs 15,000

iQOO రెండు ఏళ్ల మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌ (Android Updates)లతో పాటు 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌ (Security Patch)లను అందించనుంది. ఈ డివైజ్ ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించి స్మార్ట్ ఫోన్ యూజర్లు RAMని 8GB వరకు పొడిగించుకోవచ్చు. FHD+ రిజల్యూషన్‌తో 6.58-అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ 5G ఫోన్ ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 50-MP ప్రైమరీ కెమెరా 2-MP మాక్రో కెమెరాతో సహా వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా ఉంది. 5,000mAh బ్యాటరీతో కంపెనీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా అందిస్తోంది.

Read Also : Amazon Festival Sale Date : ఆ రోజు నుంచే అమెజాన్ ఫెస్టివల్ సేల్.. iPhone 13, iQOO 9T ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో టాప్ డీల్స్.. డోంట్ మిస్..!