జెట్ ఎయిర్‌వేస్ విమాన టికెట్‌పై 50 శాతం డిస్కౌంట్

జెట్ ఎయిర్‌వేస్ టికెట్ ధరల పై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చని ప్రముఖ విమానయాన సంస్థ పేర్కొంది. డిస్కౌంట్ కేవలం ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు మాత్రమే ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎంపిక చేసిన దేశీ, విదేశీ ఫ్లైట్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్నవారు అంతర్జాతీయ రూట్లలో ఫిబ్రవరి 21 నుంచే ప్రయాణం చేయవచ్చు. రిఫండ్ చార్జీలు, వీకెండ్ సర్‌చార్జీలు, ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ వంటివి కొనసాగుతాయి. కంపెనీ మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవడం ద్వారా డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు.
అంతేకాదు ఇండిగో, స్పైస్ జెట్ వంటి కంపెనీలు ఇప్పటికే టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా విమానయాన రంగంలో తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్యాసింజర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
Read Also:ముద్దు కోసం ఎన్ని తిప్పలో.. చితక్కొట్టిన పోలీసులు..!
Read Also:దేశముదురు వ్యాపారులు : పాక్ డౌన్ డౌన్ అంటే డిస్కౌంట్లు
Read Also: ఫిటింగ్ వర్మ : చంద్రబాబు కంటే రానానే రియల్