Jio Fiber Fixed Line Service : అతిపెద్ద ఫిక్స్‌డ్ లైన్‌ సర్వీసు ప్రొవైడర్‌గా జియో అగ్రస్థానం.. ఫైబర్ నెట్‌లోనే కాదు.. మొబైల్ నెట్‌వర్క్‌లోనూ టాప్!

Jio Fiber Fixed Line Service : దేశీయ ప్రైవేట్ టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియో (Reliance Jio) అతిపెద్ద ఫిక్స్‌డ్ లైన్‌ సర్వీసు ప్రొవైడర్‌గా అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ (TRAI) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రిలయన్స్ జియో ఆగస్టులో ప్రభుత్వరంగ (BSNL)ని వెనక్కి నెట్టేసి టాప్ ప్లేసులోకి దూసుకెళ్లింది.

Jio Fiber Fixed Line Service : అతిపెద్ద ఫిక్స్‌డ్ లైన్‌ సర్వీసు ప్రొవైడర్‌గా జియో అగ్రస్థానం.. ఫైబర్ నెట్‌లోనే కాదు.. మొబైల్ నెట్‌వర్క్‌లోనూ టాప్!

Jio topples BSNL to become largest fixed-line service provider in August

Updated On : October 19, 2022 / 6:35 PM IST

Jio Fiber Fixed Line Service : దేశీయ ప్రైవేట్ టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియో (Reliance Jio) అతిపెద్ద ఫిక్స్‌డ్ లైన్‌ సర్వీసు ప్రొవైడర్‌గా అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ (TRAI) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రిలయన్స్ జియో ఆగస్టులో ప్రభుత్వరంగ (BSNL)ని వెనక్కి నెట్టేసి టాప్ ప్లేసులోకి దూసుకెళ్లింది. దాంతో దేశంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్ లైన్ సర్వీస్ ప్రొవైడర్‌గా జియో అవతరించింది. దేశంలో టెలికాం సేవలు ప్రారంభమైన తర్వాత ఒక ప్రైవేట్ ఆపరేటర్ వైర్‌లైన్ సెగ్మెంట్‌లో నంబర్‌వన్ స్థానాన్ని పొందడం ఇదే తొలిసారి.

ట్రాయ్ ఆగస్టు సబ్‌స్ర్కైబర్ల నివేదిక ప్రకారం.. జియో వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ బేస్ 73.52 లక్షలకు చేరుకోగా.. BSNL వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ 71.32 లక్షలకు చేరుకుంది. BSNL గత 22 ఏళ్ల నుంచి వైర్‌లైన్ సర్వీసులను అందిస్తోంది. అయితే Jio 3 ఏళ్ల క్రితమే వైర్‌లైన్ ఆఫర్‌ను ప్రారంభించింది. అప్పటినుంచి దేశంలోని జియో ఫైబర్ వైర్‌లైన్ సబ్ స్ర్కైబర్లు జూలైలో 2.56 కోట్ల నుంచి ఆగస్టులో 2.59 కోట్లకు పెరిగారు. దాంతో రిలయన్స్ జియో ఫైబర్ నెట్‌వర్క్ సర్వీసుల్లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. జియో 2.62 లక్షల మంది కొత్త కస్టమర్లను, భారతీ ఎయిర్‌టెల్ 1.19 లక్షలు, వొడాఫోన్ ఐడియా (Vi) 4,202, టాటా టెలిసర్వీసెస్ 3,769 మందిని చేర్చుకోవడంతో జియో టెలికం రంగంలో ఆధిపత్యం చెలాయించింది. అయితే, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన BSNL, MTNL ఆగస్టులో వరుసగా 15,734, 13,395 వైర్‌లైన్ కస్టమర్లను కోల్పోయాయి.

Jio topples BSNL to become largest fixed-line service provider in August

Jio topples BSNL to become largest fixed-line service provider in August

రెండో స్థానంలో BSNL.. మూడో స్థానంలో ఎయిర్‌టెల్ :
జియో ఫైబర్ అగ్రస్థానానికి చేరడంతో BSNL యూజర్లు 71.32 లక్షలతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఎయిర్‌టెల్ 61.9 లక్షలతో మూడో స్థానంలో నిలిచింది. ట్రాయ్ (TRAI) నివేదిక ప్రకారం.. దేశంలోని మొత్తం టెలికాం సబ్‌స్క్రైబర్ బేస్ ఆగస్టులో 117.5 కోట్లకు స్వల్పంగా పెరిగింది. జియో చాలా మంది కొత్త కస్టమర్‌లను చేర్చుకుంది. అందులో ఎక్కువగా పట్టణ కేంద్రాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనుంచే కొత్త కస్టమర్లు చేరుతున్నారు. భారత్‌లో టెలిఫోన్ చందాదారుల సంఖ్య జూలై-22 చివరి నాటికి 1,173.66 మిలియన్ల నుంచి ఆగస్టు-22 చివరి నాటికి 1,175.08 మిలియన్లకు పెరిగింది. తద్వారా నెలవారీ వృద్ధి రేటు 0.12 శాతంగా ఉందని ఆగస్ట్ 2022కి ట్రాయ్ సబ్‌స్క్రైబర్ నివేదిక పేర్కొంది.

పట్టణ, గ్రామీణ టెలిఫోన్ సబ్‌స్క్రిప్షన్‌ల నెలవారీ వృద్ధి రేట్లు వరుసగా 0.10, 0.14 శాతంగా ఉన్నాయి. రిలయన్స్ జియో ( 32.81 లక్షలు), భారతీ ఎయిర్‌టెల్ (3.26 లక్షలు) మాత్రమే కొత్త మొబైల్ కస్టమర్‌లను చేర్చుకున్నాయి. అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రైవేట్ సంస్థ Vi (వోడాఫోన్ ఐడియా) ఆగస్టులో అత్యధికంగా నష్టపోయింది. Vi కంపెనీ 19.58 లక్షల మంది మొబైల్ కస్టమర్లను కోల్పోయింది. BSNL 5.67 లక్షలు, MTNL 470, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 32 మంది కస్టమర్లను కోల్పోయింది.

Jio topples BSNL to become largest fixed-line service provider in August

Jio topples BSNL to become largest fixed-line service provider in August

దేశంలో బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు జూలైలో 80.74 కోట్ల నుంచి ఆగస్టులో 0.81 శాతం పెరిగి 81.39 కోట్లకు చేరుకున్నారు. ఆగస్టులో మొత్తం బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లలో 98.39 శాతం మార్కెట్ వాటాను టాప్ ఐదు సర్వీస్ ప్రొవైడర్లు కలిగి ఉన్నారు. రిలయన్స్ జియోకు ఆగస్టులో 42.58 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు, భారతీ ఎయిర్‌టెల్ 22.39 కోట్లు, Vi కంపెనీకి 12.31 కోట్లు, BSNL 42.58 కోట్లు, అట్రియా కన్వర్జెన్స్‌ (Atria Convergence)కు 21.3 లక్షల బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 1.70 లక్షలకు పైగా సబ్ స్ర్కైబర్లతో వైర్‌లెస్ మొబైల్ నెట్‌వర్క్ కూడా జియో టాప్‌లో నిలిచింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. 2022 ఆగస్టులో జియోకు కొత్తగా 32.8 లక్షల కస్టమర్లు వచ్చి చేరారు. దాంతో జియో మొత్తం కస్టమర్ బేస్ 41.92 కోట్లకు చేరింది. ఎయిర్‌టెల్ 3.26 లక్షల మంది కస్టమర్లు చేరగా.. వోడాఫోన్ ఐడియా 19.58 లక్షలు, BSNL 5.67 లక్షలు, MTNL 470 మంది యూజర్లను కోల్పోయాయి. ఏపీ టెలికాం సర్కిల్ (తెలంగాణ & ఏపీ)లోనూ రిలయన్స్ జియో (Reliance Jio) 1.70 లక్షలకు పైగా కొత్త సబ్‌స్ర్కైబర్లను చేర్చుకుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : BSNL New Plans : బీఎస్ఎన్ఎల్ నుంచి సరసమైన ధరకే రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ కోసం ఈ ప్లాన్లు ట్రై చేయండి!