Jio World Plaza : అతిపెద్ద జియో వరల్డ్ ప్లాజా లగ్జరీ మాల్.. ముంబైలో నవంబర్ 1నే ప్రారంభం.. గ్లోబల్ బ్రాండ్లతో కస్టమర్లకు ఫుల్ ట్రీట్..!
Jio World Plaza : జియో వరల్డ్ ప్లాజా లగ్జరీ మాల్ ఆర్థిక రాజధాని ముంబైలో నవంబర్ 1న ప్రారంభం కానుంది. గ్లోబల్ బ్రాండ్లతో కస్టమర్లకు ఫుల్ ట్రీట్ అందించనుంది.

Jio World Plaza Opens in Mumbai, top-end retail and entertainment experiences in India
Jio World Plaza : ప్రముఖ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారత మార్కెట్లో అతిపెద్ద లగ్జరీ మాల్ జియో వరల్డ్ ప్లాజా (Jio World Plaza Mall)ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. నవంబర్ 1న అట్టహాసంగా ఈ జియో వరల్డ్ ప్లాజా మాల్ ప్రారంభోత్సవ వేడుక జరగనుంది.
ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా కుర్లూ కాంప్లెక్స్‌లో ఈ లగ్జరీ మాల్‌ను రిలయన్స్ ఏర్పాటు చేసింది. దేశంలో టాప్-ఎండ్, గ్లోబల్ స్టాండర్డ్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు రిటైల్ జియో వరల్డ్ ప్లాజాను ప్రారంభించనుంది. ముంబై నడిబొడ్డున BKCలో జియో వరల్డ్ ప్లాజా (JWP), నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్‌కు దగ్గరగా సందర్శకులకు సులభంగా ఉండేలా ఏర్పాటు చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. ‘జియో వరల్డ్ ప్లాజా అనేది భారత్‌లో అత్యుత్తమ గ్లోబల్ బ్రాండ్లను తీసుకురావడమే కాకుండా టాప్ భారతీయ బ్రాండ్ల నైపుణ్యాన్ని హైలైట్ చేయనుంది. ప్రత్యేకమైన రిటైల్ ఎక్స్పీరియన్స్ అందించనున్నాం. శ్రేష్ఠత, ఆవిష్కరణ, కస్టమర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడం కోసం అన్వేషణలో ప్రతి వెంచర్లో మమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది’ అని ఆమె అన్నారు.
రిటైల్, రెస్ట్, ఫుడ్ కోసం స్పెషల్ హబ్ :
జియో వరల్డ్ ప్లాజా రిటైల్, రెస్ట్, భోజనాల కోసం ప్రత్యేకమైన హబ్‌గా రూపొందించింది. 7,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు లెవల్స్‌లో విస్తరించగా.. రిటైల్ మిక్స్ 66 లగ్జరీ బ్రాండ్లతో ఆకట్టుకునేలా ఉంది. బాలెన్సియాగా, జార్జియో అర్మానీ కేఫ్, పోటరీ బార్న్ కిడ్స్, శాంసంగ్ ఎక్స్పీరియన్స్ సెంటర్, EL&N కేఫ్, రిమోవా వంటి అంతర్జాతీయ నూతనంగా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ముంబై వాలెంటినో,టోరీ బుర్చ్, YSL, వెర్సేస్, టిఫనీ, లాడూరీ, పోటరీ బార్న్‌ల మొదటి స్టోర్లు ఇదే మాల్లో ఉంటాయి. అయితే, కీలకమైన ఫ్లాగ్‌షిప్‌లలో లూయిస్ విట్టన్, గూచీ, కార్టియర్, బల్లి, జార్జియో అర్మానీ, డియోర్, YSL, బల్గారి వంటి ఇతర దిగ్గజ బ్రాండ్లు కూడా ఉన్నాయి.

Jio World Plaza Opens in Mumbai in India
ఈ జియో ప్లాజా మనీష్ మల్హోత్రా, అబు జానీ-సందీప్ ఖోస్లా, రాహుల్ మిశ్రా, ఫల్గుణి, షేన్ పీకాక్, రి బై రీతు కుమార్ వంటి ప్రఖ్యాత డిజైనర్లకు కూడా నిలయంగా ఉంటుంది. ప్లాజా నిర్మాణం, తామర పువ్వు మాదిరిగా ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. యునైటెడ్ స్టేట్స్లో ప్రధాన కార్యాలయం కలిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆర్కిటెక్చర్, డిజైన్ సంస్థ టీవీఎస్, రిలయన్స్ బృందం మధ్య సహకారంతో ఈ లగ్జరీ మాల్ కార్యరూపం దాల్చింది. షాపింగ్ కాన్కోర్స్ శిల్పకళా స్తంభాలతో అద్భుతమైన ఐకాన్ కలిగి ఉంటుంది. ఫాబ్రిక్లో డిజైన్, పాలరాతితో కప్పిన అంతస్తులు, ఎగుడుదిగుడుగా ఉన్న పైకప్పులు, మృదువైన లైటింగ్ కళాత్మకంగా ఎంతో విలాసవంతమైన ఉంటాయి.
కస్టమర్ ఎక్స్పీరియన్స్ కోసం కొత్త సర్వీసులు :
ఇషా అంబానీ మార్గదర్శకంలో JWP మాల్ ప్రధానమైన కస్టమర్ ఎక్స్పీరియన్స్ అందించనుంది. మొదటి స్థాయిలో సందర్శకులను స్వాగతించే జితీష్ కల్లాట్ శిల్పం నుంచి మల్టీప్లెక్స్ థియేటర్, గుడ్ క్యూరేటెడ్ గౌర్మెట్ ఫుడ్ ఎంపోరియం, అలాగే ప్రపంచ స్థాయి రెస్టారెంట్లతో సహా 3వ లెవల్స్‌లో ఎంటర్టైన్మెంట్ అందించడమే ప్లాజా లక్ష్యంగా కనిపిస్తోంది. దుకాణదారులు పూర్తి రిటైల్ ఎక్స్పీరియన్స్ పొందేలా పర్సనల్ షాపింగ్, వీఐపీ కాన్సీర్జ్, టాక్సీ-ఆన్-కాల్, వీల్‌చైర్ సర్వీసులు, బ్యాగేజీ డ్రాప్‌తో హ్యాండ్స్-ఫ్రీ షాపింగ్, బట్లర్ సర్వీస్, బేబీ స్త్రోలర్లు వంటి సర్వీసులతో యూజర్లను మరింతగా ఆకర్షించనున్నాయి.
Read Also : Jio Prepaid Plans : రిలయన్స్ జియో ప్రీపెయిడ్ 5G టారిఫ్ ప్లాన్ల ధరలు పెంచనుందా? కంపెనీ క్లారిటీ ఇదిగో..!