JioFinance App : కొత్త జియోఫైనాన్స్ యాప్.. ఇకపై చిటికెలో యూపీఐ, యూటిలిటీ, లోన్ పేమెంట్లు చేయొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

JioFinance App : జేఎఫ్ఎస్ఎల్ ప్రకారం.. జియోఫైనాన్స్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో ఐఓఎస్ డివైజ్‌ల కోసం యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసేందుకు అందుబాటులో ఉంది.

JioFinance App : కొత్త జియోఫైనాన్స్ యాప్.. ఇకపై చిటికెలో యూపీఐ, యూటిలిటీ, లోన్ పేమెంట్లు చేయొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

JioFinance App With UPI, Utility Payments and Loan Functionality Launched in India

Updated On : October 11, 2024 / 6:31 PM IST

JioFinance App : భారతీయ యూజర్ల ఆర్థిక అవసరాల కోసం కొత్త జియో ఫైనాన్స్ యాప్ వచ్చేసింది. గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL)చే రూపొందించారు. దేశంలోని యూజర్లు ఈ యూప్ ద్వారా యూపీఐ లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్‌లలో మానిటరింగ్, పెట్టుబడి పెట్టడం, బిల్లు చెల్లింపులు చేసుకోవచ్చు. ముఖ్యంగా, మొదట మేలో ఈ కొత్త జియోఫైనాన్స్ యాప్ బీటా వెర్షన్‌లో ప్రవేశపెట్టగా.. జేఎఫ్ఎస్ఎల్ ఇప్పటికే 6 మిలియన్ల మంది వినియోగదారులు ఈ యాప్ సర్వీసులను ఉపయోగించుకున్నారని పేర్కొంది.

Read Also : iPhone 15 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఇదే బెస్ట్ టైమ్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

జియో ఫైనాన్స్ యాప్ ఫీచర్లు ఇవే :
జేఎఫ్ఎస్ఎల్ ప్రకారం.. జియోఫైనాన్స్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో ఐఓఎస్ డివైజ్‌ల కోసం యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసేందుకు అందుబాటులో ఉంది. ప్రత్యామ్నాయంగా, మైజియో ప్లాట్‌ఫారమ్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. జియోఫైనాన్స్‌తో వినియోగదారులు తమ బ్యాంక్ అకౌంట్లను లింక్ చేయడం ద్వారా ఆఫ్‌లైన్ మర్చంట్ల వద్ద క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయొచ్చు. తద్వారా యూపీఐ పేమెంట్లను పూర్తి చేయొచ్చు.

ఆన్‌లైన్ పేమెంట్లు, డబ్బును ఇతర వినియోగదారులకు పంపందుకు కూడా అనుమతిస్తుంది. యాప్ యూపీఐ ఇంటర్నేషనల్ ఫీచర్‌ సాయంతో పేమెంట్ల కోసం ఈజీగా ఉపయోగించవచ్చు. యూపీఐలను డిలీట్ చేయడం, బ్యాంక్ అకౌంట్లను మార్చడం, ఆర్డర్లు సెట్ చేయడం వంటి వివిధ సెట్టింగ్‌లను యాప్ ద్వారా నిర్వహించవచ్చు. యాప్‌లో నిర్వహించే ప్రతి యూపీఐ లావాదేవీకి రివార్డ్‌లు కూడా పొందవచ్చు.

3 దశల్లో జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్ ఉపయోగించి కస్టమర్‌లు (NEFT) లేదా (IMPS) ద్వారా ఫండ్స్ పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు. ఫిజికల్ డెబిట్ కార్డ్‌ని కూడా పొందవచ్చు. యూటిలిటీ బిల్లు పేమెంట్లు, మొబైల్, ఫాస్ట్యాగ్, డీటీహెచ్ రీఛార్జ్‌లు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు వంటివి ఇతర పేమెంట్ సర్వీసు యాప్‌ల మాదిరిగానే జియోఫైనాన్స్ కూడా యాక్టివిటీలను అందిస్తుంది. లోన్ ఆన్-చాట్ ఫీచర్‌తో వినియోగదారులు లోన్‌లు, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ, హోమ్ లోన్‌లతో సహా రుణాలను పొందవచ్చు.

అంతేకాదు.. వాటిని ట్రాన్స్‌ఫర్ కూడా చేయొచ్చు.జేఎఫ్ఎస్ఎల్ ఒకేసారి పూర్తి మొత్తానికి వినియోగించిన మొత్తానికి వడ్డీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. జియోఫైనాన్స్ యాప్ అందించే లోన్ సదుపాయం.. వేతనం, ఎమ్ఎస్ఎమ్ఈ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. యాప్ బీమా సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. వినియోగదారులు జియోఫైనాన్స్‌లో లైఫ్, హెల్త్, టూ-వీలర్, మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను పొందవచ్చు.

Read Also : WhatsApp New Chat : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వస్తోంది.. మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు..!