Juiy App Launch : ఈవీ వాహనాల కోసం బైయింగ్ అసిస్టెంట్ జూయి యాప్.. ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Juiy App Launch : జూయి కస్టమర్‌లతో మొదలై వాహనం డెలివరీ వరకు అన్ని పూర్తి చేయొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వాహనాలు మాత్రమే విక్రయిస్తోంది. రాబోయే నెలల్లో మరిన్ని నగరాలకు విస్తరించే ప్లాన్లను సిద్ధం చేస్తోంది.

Juiy app launch by Telangana IT Minister Sridhar Babu
Juiy App Launch : ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం బైయింగ్ అసిస్టెంట్ యాప్ ‘జూయి యాప్’ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త యాప్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ ఆవిష్కరణ సందర్భంగా ఆయన జూయి యాప్ ప్రారంభించారు.
టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ఈ కొత్త బైయింగ్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దేశ ప్రగతికి చోదక శక్తులుగా పేర్కొన్నారు. జూయి యాప్ వ్యవస్థాపకులు మహంత్ మల్లికార్జున, ప్రణయ్ కొమ్ముల అంకిత భావం, కృషిని అభినందిస్తున్నానని అన్నారు.
ఈవీపై అపోహలను తొలగిస్తుంది :
గత ఐదేళ్లలో ఈవీ, బ్యాటరీ టెక్నాలజీలో అనేక ఆవిష్కరణలను సాధించింది. అయినప్పటికీ, కొనుగోలుదారులలో ఈవీ కొనుగోళ్లపై అనేక అపోహలు ఉన్నాయి. జూయి ఈ అపోహలను పరిష్కరించడమే కాదు.. ఎలక్ట్రిక్ వాహనాలను యూజర్లకు దగ్గర చేసేలా చేస్తుంది.

Juiy app launch
టూ వీలర్ వెహికల్స్‌తో ప్రారంభించి 150 మిలియన్ యూనిట్లకుపైగా దేశంలో అతిపెద్ద సెగ్మెంట్ అని చెప్పవచ్చు. జూయి కస్టమర్‌లతో మొదలై వాహనం డెలివరీ వరకు అన్ని పూర్తి చేయొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వాహనాలు మాత్రమే విక్రయిస్తోంది. రాబోయే నెలల్లో మరిన్ని నగరాలకు విస్తరించే ప్లాన్లను సిద్ధం చేస్తోంది.
మహంత్ మల్లికార్జున జూయి సహ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఆకర్షణీయమైన ఆప్షన్లను అందించడమే లక్ష్యమన్నారు. ప్రణయ్ కొమ్ము మాట్లాడుతూ.. ఈ యాప్ వాహనం ట్రాకింగ్ నుంచి డెలివరీ వరకు కస్టమర్‌లకు సాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వచ్చే సంవత్సరంలో ఒక మిలియన్ కొనుగోలుదారులను ఐసీఈ నుంచి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మార్చే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు.
ఈ యాప్ దాదాపు అన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్‌లపై వర్క్ చేస్తుంది. ఫైనాన్స్ కోసం యాక్సిస్ బ్యాంక్, లోన్‌టాప్, ఇన్సూరెన్స్ అవసరాల కోసం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, చోలా ఏం ఎస్, కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది. వచ్చే సంవత్సరంలో ఒక మిలియన్ కొనుగోలుదారులను ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మార్చే లక్ష్యంతో జూయి పనిచేస్తుంది.
Read Also : Samsung Neo TV Models : శాంసంగ్ నుంచి ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫీచర్లతో 2 కొత్త నియో క్యూఎల్ఈడీ టీవీ మోడల్స్..!