LinkedIn Layoff : లింక్డ్‌ఇన్ నుంచి 668 మంది ఉద్యోగులు ఔట్.. ఎందుకంటే?

మైక్రోసాప్ట్ యాజమాన్యంలోని లింక్డ్ఇన్ మరిన్ని ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. తాజాగా నిర్ణయం వల్ల దాదాపు 3శాతం మంది అంటే 668 మంది ఉద్యోగులపై వేటు పడబోతుంది.

LinkedIn Layoff : లింక్డ్‌ఇన్ నుంచి 668 మంది ఉద్యోగులు ఔట్.. ఎందుకంటే?

LinkedIn

LinkedIn : మైక్రోసాప్ట్ యాజమాన్యంలోని లింక్డ్ఇన్ మరిన్ని ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. 20వేల మంది సిబ్బందితో కలిగిన లింక్డ్ఇన్.. తాజాగా నిర్ణయం వల్ల దాదాపు 3శాతం మంది అంటే 668 మంది ఉద్యోగులపై వేటు పడబోతుంది. లింక్డ్ఇన్ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఇంజనీరింగ్, ఉత్పత్తి, ప్రతిభ, ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగులపై వేటు పడనుంది. లింక్డ్ఇన్ తన అధికారిక బ్లాగ్ పోస్టులో ఇలా పేర్కొంది.. ఈరోజు మేము మా బృందంతో కలిసి చేసిన మార్పుల వల్ల మా ఇంజనీరింగ్, ఉత్పత్తి, ఫైనాన్స్ విభాగాల్లో దాదాపు 668 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందని పేర్కొంది.

Read Also : Pune Accident : పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురి మృతి, ఇద్దరికి గాయాలు

లిక్డ్ఇన్ జాబ్ యాడ్ లిస్టింగ్ లు, ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ల ద్వారా ఆదాయ వనరులను సమకూర్చుకుంటుంది. దీనికి దాదాపు 950 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. కొత్త సభ్యులకు సైన్ అప్ చేయడం కొనసాగిస్తున్నప్పటికీ ప్రకటనల వ్యయం తగ్గడంతోపాటు, పలు కారణాల వల్ల కంపెనీ ఆర్థికంగా దెబ్బతింది. ఇదిలాఉంటే ఈ ఏడాది మే నెలలో తొలివిడత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కంపెనీ చేపట్టింది. విక్రయాలు, కార్యకలాపాలు, సహాయక బృందాలలో 716 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో 668 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు లిక్డ్ఇన్ సిద్ధమైంది.

Read Also : Honda CB300R 2023 : కొత్త బైక్ కొంటున్నారా? హోండా CB300R 2023 బైక్ వచ్చేసింది.. భారత్‌లో ధర ఎంతంటే?

2022 సంవత్సరం చివరి నుంచి అమెజాన్, మెటా, గూగుల్, అల్పాబెట్ తో సహా పలు కంపెనీలు సాంకేతిక రంగంలో పదివేల మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరి 2023లో లింక్డ్ ఇన్ యొక్క మాతృసంస్థ మైక్రోసాప్ట్ పదివేల మంది రిడెండెన్సీలను ప్రకటించింది. ఈ కంపెనీలన్నీ చాట్‌జిపిటి (మైక్రోసాప్ట్ యాజమాన్యం), బార్డ్ (గూగుల్ ద్వారా) వంటి AI-ఆధారిత సాంకేతికతలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.