Mahindra BE 6 : కొంటే ఈ లగ్జరీ కారు కొనాలి.. జస్ట్ రూ. 5 లక్షల డౌన్ పేమెంట్‌తో మహీంద్రా BE6 ఇంటికి.. నెలకు EMI ఎంతంటే?
Mahindra BE 6 : కొత్త కారు కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. మహీంద్రా బీఈ 6 లగ్జరీ మోడల్ అత్యంత సరసమైన ధరలో లభిస్తోంది. మీరు కేవలం రూ. 5 లక్షల డౌన్ పేమెంట్ కట్టి తెచ్చుకోవచ్చు.. ఎలాగంటే?
Mahindra BE 6
- మహీంద్రా బీఈ 6 సరసమైన ధరకే ఇలా కొనొచ్చు తెలుసా?
- రూ. 5 లక్షల డౌన్ పేమెంట్ కడితే చాలు లగ్జరీ కారు ఇంటికి
- బ్యాంకు నుంచి రూ. 14.87 లక్షలు భారీ లోన్ తీసుకోవచ్చు
Mahindra BE 6 : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ఇది మీకోసమే.. మీరు మహీంద్రా లవర్స్ అయితే మీకోసం మార్కెట్లో అద్భుతమైన కారు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 2026లో మహీంద్రా అడ్వాన్స్, పవర్ఫుల్ ఎలక్ట్రిక్ SUV మహీంద్రా BE 6 మోడల్ సొంతం చేసుకోవచ్చు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించే ఫుల్ ఎలక్ట్రిక్ రేంజ్ కోరుకునే హై రేంజ్ కొనుగోలుదారులకు BE 6 బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
మీ దగ్గర రూ.5 లక్షలు డౌన్ పేమెంట్ ఉంటే.. ఈ లగ్జరీ కారును సరసమైన ఈఎంఐతో ఇంటికి తెచ్చుకోవచ్చు. మహీంద్రా BE 6 ఫైనాన్స్ ప్లాన్, ఆన్-రోడ్ ఖర్చులు, అద్భుతమైన ఫీచర్ల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..
BE6 ఫుల్ ఆన్-రోడ్ ధర :
మహీంద్రా BE 6 ‘ప్యాక్ వన్’ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తుతం రూ. 18.90 లక్షలు. ఢిల్లీ నగరంలో ఈ పవర్ ఫుల్ కారు రిజిస్టర్ చేస్తే.. ఇన్సూరెన్స్ కోసం సుమారుగా రూ. 78,000, టీసీఎస్ సుమారుగా రూ. 19,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లగ్జరీ SUV ఆన్-రోడ్ ధర మొత్తం రూ. 19.87 లక్షలకు చేరుతుంది. మీరు రూ. 5 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే.. బ్యాంకు నుంచి సుమారుగా రూ. 14.87 లక్షల భారీ రుణం తీసుకోవచ్చు.
నెలవారీ ఈఎంఐ, వడ్డీ :
ఒకవేళ బ్యాంకు మీకు రూ. 14.87 లక్షలను 7 ఏళ్ల కాలానికి 9శాతం వార్షిక వడ్డీ రేటుతో లోన్ ఇస్తే.. మీ నెలవారీ వాయిదా రూ. 23,931 అవుతుంది. ఈ 7 ఏళ్ల కాలంలో బ్యాంకుకు అదనంగా రూ. 5.22 లక్షలు వడ్డీ రూపంలో చెల్లిస్తారు. అందుకే మీ మహీంద్రా BE 6 మొత్తం ప్రీమియం ధర (ఆన్-రోడ్, వడ్డీతో కలిపి) సుమారు రూ. 25.10 లక్షలు అవుతుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ టెక్నాలజీ, 683 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను అందిస్తుంది.
మార్కెట్లో గట్టి పోటీ :
భారతీయ ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్లో మహీంద్రా BE 6 మోడల్ మార్కెట్లో పోటీదారుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. టాటా కర్వ్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ, రాబోయే హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, విన్‌ఫాస్ట్ VF6 లతో నేరుగా పోటీపడుతుంది. టాటా కర్వ్ కూపే డిజైన్ ఆకట్టుకునేలా ఉంటుంది. BE6 INGLO ప్లాట్‌ఫామ్, 282bhp పవర్, 5-స్టార్ భారత్ NCAP సేఫ్టీ రేటింగ్ కారణంగా సరసమైన ధరకే లభిస్తుంది.
