Maruti Suzuki Jimny Launch : మహీంద్రా థార్‌కు పోటీగా 5 డోర్లతో మారుతీ సుజుకి జిమ్నీ.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?

Maruti Suzuki Jimny Launch : మారుతి సుజుకి జిమ్నీ ధర, వేరియంట్లు, పోటీదారులు, మైలేజీ, కొత్త 5-డోర్ SUV గురించి అన్ని ఇతర వివరాలు అందుబాటులో ఉన్నాయి.

Maruti Suzuki Jimny Launch : మహీంద్రా థార్‌కు పోటీగా 5 డోర్లతో మారుతీ సుజుకి జిమ్నీ.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?

Maruti Suzuki Jimny launched in India, price starts at Rs 12.74 lakh

Maruti Suzuki Jimny Launch in India : ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) భారత మార్కెట్లో లాంచ్ అయింది. 5-డోర్ల ఆఫ్-రోడర్ రూ. 12.74 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చింది. టాప్-స్పెక్ వేరియంట్ రూ. 15.05 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. జిమ్నీ కస్టమర్ డెలివరీలు జూన్ 7 నుంచే ప్రారంభమవుతున్నాయి. ఈ జిమ్నీ SUV మారుతి Nexa అవుట్‌లెట్‌ల నుంచి విక్రయిస్తోంది. ఇప్పటికే, మారుతి సుజుకి కార్లలో Ignis, Baleno, Ciaz, XL6, Fronx, Grand Vitara వాహనాలను కూడా అందిస్తున్నాయి.

మారుతి సుజుకి SUV పాత K15B 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని ఉపయోగిస్తుంది. 105PS గరిష్ట శక్తిని, 134Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ MT, 4-స్పీడ్ AT ఉన్నాయి. లాడర్ ఫ్రేమ్ ఆధారంగా SUV లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ గేర్ (4L మోడ్) ప్రమాణంగా ALLGRIP PRO 4WD టెక్నాలజీని కలిగి ఉంది. మారుతి సుజుకి జిమ్నీ మైలేజ్ 5-స్పీడ్ MTకి 16.94kmpl, 4-స్పీడ్ ATకి 16.39kmpl వరకు అందిస్తుంది. ట్రిమ్‌ల విషయానికి వస్తే.. జీటా, ఆల్ఫా రెండు ఉన్నాయి. వేరియంట్‌ల వారీగా మారుతి సుజుకి జిమ్నీ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.

Read Also : Airtel New Prepaid Plans : ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ డేటా ప్లాన్.. హైస్పీడ్ డేటా కోసం ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

జీటా MT – రూ. 12.74 లక్షలు
జీటా AT – రూ. 13.94 లక్షలు
ఆల్ఫా MT – రూ. 13.69 లక్షలు
ఆల్ఫా AT – రూ. 14.89 లక్షలు
ఆల్ఫా MT (డ్యూయల్ టోన్) – రూ. 13.85 లక్షలు
ఆల్ఫా AT (డ్యూయల్ టోన్) – రూ. 15.05 లక్షలు

Maruti Suzuki Jimny launched in India, price starts at Rs 12.74 lakh

Maruti Suzuki Jimny launch in India, price starts at Rs 12.74 lakh

మారుతీ సుజుకి జిమ్నీ మహీంద్రా థార్‌కు పోటీదారుగా ఉంటుంది. జిమ్నీ వర్సెస్ థార్ డిబేట్‌లో మారుతీ మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘జిమ్నీ పవర్ టు వెయిట్ రేషియో (థార్ కన్నా) చాలా మెరుగ్గా ఉంది. ఫిట్‌నెస్, అధిక బరువు ఉన్నవారికి చాలా ప్రత్యేకమైనది. ఆఫ్-రోడింగ్ సామర్థ్యం పరంగా చూస్తే.. ప్రస్తుతం మార్కెట్‌లో ఇదే అత్యుత్తమం. ఫీచర్ల విషయానికి వస్తే.. ఆఫ్-రోడర్‌లో వాషర్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్‌గా ఎడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఫోల్డబుల్ ORVMలు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. హార్డ్ టాప్, డ్రిప్ రైల్స్, క్లామ్‌షెల్ బానెట్, టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ వంటి కొన్ని ఫీచర్లు ప్రామాణికమైనవిగా చెప్పవచ్చు.

క్యాబిన్ లోపల, HD డిస్‌ప్లే, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto కనెక్టివిటీ, Arkamys సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన 9-అంగుళాల Smart Play Pro+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందవచ్చు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, రియర్‌వ్యూ కెమెరా, ISOFIX, EBDతో కూడిన ABS వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. మారుతి SUV పోర్ట్‌ఫోలియోలో Fronx, Brezza, Jimny, Grand Vitara అనే 4 మోడల్‌లను కలిగి ఉంది. కార్‌మేకర్ FY24లో 475,000 యూనిట్ల వాల్యూమ్‌లతో SUV మార్కెట్‌లో 25శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : Google Pay UPI Account : గూగుల్ పేలో ఆధార్‌తో ఈజీగా యూపీఐ అకౌంట్ యాక్టివేషన్.. మీ ఫోన్ నెంబర్ ఒకటేనా? చెక్ చేసుకోండి!