Google Pay UPI Account : గూగుల్ పేలో ఆధార్‌తో ఈజీగా యూపీఐ అకౌంట్ యాక్టివేషన్.. మీ ఫోన్ నెంబర్ ఒకటేనా? చెక్ చేసుకోండి!

Google Pay UPI Account : గూగుల్ పే సర్వీసులో UPI అకౌంట్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. లేటెస్ట్ ఆప్షన్ ద్వారా UPI యూజర్లు తమ ఆధార్, బ్యాంక్ అకౌంట్లలో ఫోన్ నంబర్ ఒకేలా ఉండేలా చూసుకోవాలి.

Google Pay UPI Account : గూగుల్ పేలో ఆధార్‌తో ఈజీగా యూపీఐ అకౌంట్ యాక్టివేషన్.. మీ ఫోన్ నెంబర్ ఒకటేనా? చెక్ చేసుకోండి!

Google Pay makes it easier to activate or setup UPI account, here is how

Google Pay UPI Account : ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే (Google Pay)లో UPI అకౌంట్ యాక్టివేట్ చేయడం లేదా క్రియేట్ చేయడం చాలా సులభం. గూగుల్ పే అకౌంట్ సెటప్ చేసేందుకు ఇప్పుడు తమ ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు. డెబిట్ కార్డ్‌తో (UPI PIN) సెట్ చేయాల్సిన అవసరం లేదని కంపెనీ ప్రకటించింది.

దేశంలో వందల మిలియన్ల మంది భారతీయ యూజర్లు UPI అకౌంట్ వినియోగిస్తున్నారు. చాలా మంది వినియోగదారులకు UPI IDలను సెటప్ చేసేందుకు డిజిటల్ పేమెంట్లు చేయడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ ఫీచర్ ఇప్పుడు సపోర్టు ఉన్న బ్యాంకుల అకౌంట్‌దారులకు అందుబాటులో ఉందని గూగుల్ పేర్కొంది. భారత్‌లో వయోజన జనాభాలో 99.9 శాతం మంది ఆధార్ నంబర్‌ను కలిగి ఉన్నారని, కనీసం నెలకు ఒకసారి దాన్ని ఉపయోగిస్తున్నారని టెక్ దిగ్గజం వెల్లడించింది. అందువల్ల, యూపీఐలో ఆధార్ ఆధారిత ఆన్‌బోర్డింగ్ సదుపాయం విస్తృత సంఖ్యలో యూజర్లకు అందుబాటులో ఉంది.

Read Also : Pan-Aadhaar Linking Deadline : పాన్-ఆధార్ లింక్ డెడ్‌లైన్ ఇదిగో.. ఈ తేదీలోగా లింక్ చేయలేదంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

లేటెస్ట్ ఆప్షన్ ద్వారా UPIని వాడే యూజర్లు తమ ఆధార్, బ్యాంక్ అకౌంట్లలో ఫోన్ నంబర్ ఒకేలా ఉండేలా చూసుకోవాలి. బ్యాంక్ అకౌంట్, ఆధార్‌ను లింక్ చేయాలి. ఆ తర్వాత, మీరు లేటెస్ట్ ఫీచర్‌ని ఉపయోగించి మీ (Google Pay UPI) అకౌంట్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి (Google Pay) అకౌంట్ ఎలా యాక్టివేట్ చేయాలి లేదా సెటప్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

Google Pay makes it easier to activate or setup UPI account, here is how

Google Pay makes it easier to activate or setup UPI account

గూగుల్ పే యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. మీరు సెటప్ స్క్రీన్‌లోకి ప్రవేశించిన తర్వాత.. మీకు డెబిట్ కార్డ్ లేదా ఆధార్ ఆధారిత UPI ఆన్‌బోర్డింగ్ మధ్య ఆప్షన్ ఎంచుకోవచ్చు. కేవలం ఆధార్‌ని ఎంచుకోండి. ఇప్పుడు, ఆధార్ నంబర్‌లోని మొదటి 6 అంకెలను ఎంటర్ చేయండి. అథెంటికేషన్ పూర్తి చేసేందుకు యూజర్లు UIDAI వారి బ్యాంక్ నుంచి స్వీకరించిన OTPలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత, సంబంధిత బ్యాంక్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. తమ UPI పిన్‌ని సెట్ చేయవచ్చు.

గూగుల్ పేలో ఆధార్ నంబర్‌ సురక్షితమేనా? :
గూగుల్ పే కస్టమర్‌లు లావాదేవీలు చేయడం లేదా బ్యాలెన్స్ చెక్ చేసేందుకు గూగుల్ పే యాప్‌ని ఉపయోగించవచ్చు. గూగుల్ పే యూజర్లు ఆధార్ నంబర్‌లోని మొదటి 6 అంకెలను ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోసం NPCI ద్వారా UIDAIకి పంపుతుంది. ఈ ప్రక్రియ యూజర్ల ఆధార్ నంబర్ భద్రతను నిర్ధారిస్తుంది. గూగుల్ పేలో ఆధార్ నంబర్‌ స్టోర్ చేయదని గమనించాలి. వెరిఫికేషన్ కోసం NPCIతో ఆధార్ నంబర్‌ను షేర్ చేయడంలో కేవలం ఫెసిలిటేటర్‌గా పనిచేస్తుంది.

Read Also : Airtel New Prepaid Plans : ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ డేటా ప్లాన్.. హైస్పీడ్ డేటా కోసం ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!