Maruti Suzuki Dzire Launch : 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సన్‌రూఫ్ సేఫ్టీ ఫీచర్లతో మారుతి సుజుకి డిజైర్ కారు వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Maruti Suzuki Dzire Launch : రాబోయే ఈ కారులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, కొత్త సీట్ అప్‌హోల్‌స్టరీ, అప్‌డేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి సరికొత్త ఫీచర్లు ఉన్నాయి.

Maruti Suzuki will soon Launch Dzire ( Image Credit : Google )
Maruti Suzuki Dzire Launch : దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకి ఇటీవలే కొత్త 2024 స్విఫ్ట్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త కారుకు మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. నివేదిక ప్రకారం.. కంపెనీ త్వరలో 2024 మారుతి డిజైర్ కారును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, దీనికి సంబంధించి కొన్ని కొత్త అప్‌డేట్‌ల వివరాలను రివీల్ చేయలేదు.
రాబోయే ఈ కారులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, కొత్త సీట్ అప్‌హోల్‌స్టరీ, అప్‌డేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా, బ్యాక్ కెమెరాతో కూడిన పెద్ద ఫ్లోటింగ్ 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, పవర్ ఎడ్జెస్ట్ చేయగల సీటు, ఫోల్డింగ్ వింగ్ మిర్రర్ కూడా అందుబాటులో ఉంటుంది. కొత్త డిజైర్ సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లత రానుంది.
కొత్త మారుతి స్విఫ్ట్ మాదిరిగానే, కొత్త ఎక్స్‌టీరియర్ కలర్లు, నెక్స్ట్ జనరేషన్ డిజైర్‌లో కూడా చూడవచ్చు. కొత్తగా అప్‌డేట్ చేసిన హార్ట్‌టెక్ట్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా కొత్త 2024 మారుతి డిజైర్ అప్‌డేట్ చేసిన ఫ్రంట్ గ్రిల్, అప్‌డేట్ చేసిన బంపర్, క్లామ్ షెల్ బానెట్, కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేసిన డోర్‌లను పొందవచ్చు. ‘హార్టెక్ట్’ ప్లాట్‌ఫాం కింద అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో పాటు కార్లను మరింత బలంగా లైట్ వెయిట్‌తో తయారు చేస్తారు.
ఈ టెక్నాలజీ మొదటగా బాలెనోలో మోడల్ కారులో ఉపయోగించారు. ఇప్పుడు కొత్త డిజైర్ ఈ ప్లాట్‌ఫారమ్‌లో అందించనుంది. మారుతి ఇటీవల భారత మార్కెట్లో కొత్త స్విఫ్ట్‌ను లాంచ్ చేయనుంది. రాబోయే ఈ కొత్త డిజైర్ ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.56 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు. మెరుగైన స్టైలింగ్, మరిన్ని ఫీచర్లు, ఎక్కువ మైలేజీతో కూడిన ఈ కారును కంపెనీ అతి త్వరలోనే దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుంది.