Mercedes AMG Roadster : భారత్‌లో మెర్సిడెస్ AMG SL 55 రోడ్‌స్టర్ వచ్చేసిందోచ్.. కేవలం 3.9 సెకన్లలో 100కి.మీ దూసుకెళ్తుంది..!

Mercedes AMG Roadster : భారత మార్కెట్లోకి మెర్సిడెస్ ఎఎంజీ SL 55 రోడ్‌స్టర్ కొత్త కారు వచ్చేసింది. ఓపెన్ టాప్ స్పోర్ట్స్ కారు ధర రూ.2.35 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చు.

Mercedes AMG Roadster : భారత్‌లో మెర్సిడెస్ AMG SL 55 రోడ్‌స్టర్ వచ్చేసిందోచ్.. కేవలం 3.9 సెకన్లలో 100కి.మీ దూసుకెళ్తుంది..!

Mercedes-AMG SL 55 Roadster launched in India at Rs 2.35 crore, details here

Updated On : June 23, 2023 / 10:19 PM IST

Mercedes AMG Roadster : ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా (Mercedes-Benz India) భారత మార్కెట్లో7వ జనరేషన్ Mercedes-AMG SL 55 రోడ్‌స్టర్‌ను లాంచ్ చేసింది. ఓపెన్ టాప్ స్పోర్ట్స్ కారు ధర రూ.2.35 కోట్లు (ఎక్స్-షోరూమ్). SL 55 పవర్ 4.0-లీటర్ బై-టర్బో V8, 476bhpని అభివృద్ధి చేస్తుంది.

2023 మెర్సిడెస్ ఎంఎంజీ SL 55 డిజైన్ ఇదే :
డిజైన్ పరంగా చూస్తే.. కారు లాంగ్-బోనెట్, ఫ్రంట్-ఇంజిన్ క్యాబ్ బ్యాక్‌వర్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. పాత కారుతో పోలిస్తే.. ఈ SL పెద్ద పనామెరికానా గ్రిల్, త్రిభుజాకార హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది. అన్ని వైపులా, AMG-spec 20-అంగుళాలు కలిగి ఉంటుంది. రియల్ SL ఫోల్డబుల్ ఫాబ్రిక్ పైకప్పు ఉంది. వెనుక భాగంలో వైడ్ ర్యాప్‌రౌండ్ LED టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. డైమెన్షనల్‌గా SL పొడవు 4,705mm, ఎత్తు 1,359mm, వెడల్పు 1,915mm, 2,700mm వీల్‌బేస్‌తో వస్తుంది.

Read Also : Samsung Galaxy Z Flip 5 : వచ్చే జూలైలోనే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్.. గెలాక్సీ Z ఫ్లిప్ 5 ధర లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

2023 మెర్సిడెస్-బెంజ్ SL 55 ఇంజన్ :
మెర్సిడెస్ SL 55 మోడల్ 4.0-లీటర్ Bi-turbo V8తో వస్తుంది. 476bhp, 700Nm టార్క్‌ను అందిస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్‌తో వస్తుంది. మెర్సిడెస్ 4MATIC+ AWD సిస్టమ్ ద్వారా 4 చక్రాలను పవర్ అందిస్తుంది. ఈ సెటప్ SL 55 కేవలం 3.9 సెకన్లలో 0 నుంచి 100kmph వరకు, 295kmph వరకు దూసుకెళ్లగలదు.

Mercedes-AMG SL 55 Roadster launched in India at Rs 2.35 crore, details here

Mercedes-AMG SL 55 Roadster launched in India at Rs 2.35 crore, details here

డ్రైవింగ్ డైనమిక్స్ సిస్టమ్ :
4MATIC+ AWD సిస్టమ్ పైన, SL 55 బ్యాక్ వీల్స్ స్టీరింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. అడాప్టివ్ అడ్జస్టబుల్ డంపింగ్‌తో AMG రైడ్ కంట్రోల్ సస్పెన్షన్, ఫ్రంట్ సైడ్ 390mm డిస్క్ బ్రేక్‌లు, వెనుకవైపు 360mm డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది.

2023 మెర్సిడెస్ AMG SL 55 ఇంటీరియర్ :
SL క్యాబిన్ మెర్సిడెస్-బెంజ్ సెటప్‌ మాదిరిగా ఉంటుంది. 11.9-అంగుళాల నిలువుగా ఆధారితమైన ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డ్రైవర్ వ్యూ యాంగిల్ అనుగుణంగా ఎడ్జెస్ట్ చేయవచ్చు. డ్రైవర్ 12.3-అంగుళాల డిస్‌ప్లే, HUDని పొందుతుంది. కారులోని అన్ని డిస్‌ప్లేలు AMG-నిర్దిష్ట గ్రాఫిక్స్, డేటా ప్రొజెక్షన్‌తో వస్తాయి. అప్హోల్స్టరీ కోసం 5 ఆప్షన్లు, 2 ఇంటీరియర్ ట్రిమ్ ఎంపికల ఆప్షన్ పొందవచ్చు. ఈ ఫీచర్లలో AMG స్పోర్ట్ సీట్లు లేదా AMG పెర్ఫార్మెన్స్ సీట్లు, బర్మెస్టర్ ఆడియో, ఎయిర్‌స్కార్ఫ్ సిస్టమ్ బఫెటింగ్, AMG ట్రాక్ పేస్‌ను కలిగి ఉంటాయి. 2024 మెర్సిడెస్ ఎంఎంజీ SL 55 Porsche 911 కారెరా S క్యాబ్రియోలెట్ ధర రూ. 2.18 కోట్లతో పోటీపడుతుంది. ఈ ధరలో ఏకైక ఓపెన్-టాప్ స్పోర్ట్స్‌కార్ అని చెప్పవచ్చు.

Read Also : iPhone Users Risk Warning : ఐఫోన్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. మీ ఫోన్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే జరిగేది ఇదే..!