MRF Share: సరికొత్త చరిత్రను లిఖించిన ఎంఆర్ఎఫ్.. ఒక్కో షేరుకు రూ.1 లక్షను దాటిన భారతీయ మొదటి స్టాక్‌

ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ మంగళవారం దలాల్ స్ట్రీట్‌లో కొత్త చరిత్రను సృష్టించింది. ఎంఆర్ఎఫ్ ఒక్కో షేరు రూ.1లక్ష మార్కును దాటింది.

MRF Share: సరికొత్త చరిత్రను లిఖించిన ఎంఆర్ఎఫ్.. ఒక్కో షేరుకు రూ.1 లక్షను దాటిన భారతీయ మొదటి స్టాక్‌

MRF Share

Updated On : June 13, 2023 / 1:15 PM IST

MRF Share: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ మంగళవారం దలాల్ స్ట్రీట్‌లో కొత్త చరిత్రను సృష్టించింది. ఎంఆర్ఎఫ్ ఒక్కో షేరు రూ.1లక్ష మార్కును దాటింది. ఫలితంగా భారతదేశంలో రూ. 1లక్ష మార్క్ దాటిన తొలి స్టాక్‌గా ఎంఆర్ఎఫ్ అవతరించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎంఆర్ఎఫ్ షేరు అధిక స్థాయిలో ప్రారంభమై 1.48శాతం పెరిగి కొత్తగా 52వారాల గరిష్ట స్థాయి రూ. 1,00,439.95ను తాకింది. బీఎస్ఈలో ఎంఆర్ఎఫ్ ఒక్కో షేరుకు రూ. 1,00,300 రికార్డు స్థాయిని తాకింది. తర్వాత కాస్త దిగొచ్చి మధ్యాహ్నం 12.09 గంటల సమయంలో 0.79 శాతం లాభంతో రూ. 99.75 వద్ద ట్రేడవుతోంది.

MRF Tires: ప్రపంచంలోనే రెండవ అత్యంత పటిష్టమైన టైర్ బ్రాండ్‭గా ఎంఆర్ఎఫ్ టైర్స్

ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్‌లో ఈ సంస్థ మొత్తం 42,41,143 షేర్లను జారీ చేసింది. వీటిలో 30,60,312 షేర్లు పబ్లిక్ షేర్ హోల్డర్ల చేతిలో ఉన్నాయి. దీనిలో రిటైర్ మదుపర్ల వాటా రూ. 12.73శాతం. మిగిలిన 11,80,831 షేర్లు ప్రమోటర్ల ఆధీనంలో ఉన్నాయి. 2021 జనవరిలో ఈ కంపెనీ స్టాక్ తొలిసారి రూ. 90వేల మార్క్ ఎగువన ముగిసింది.

Undersea internet cables: సముద్రగర్భంలో అమెరికా, చైనా దేశాల ఇంటర్నెట్ కేబుల్‌ వార్.. ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీయనుందా?

ఆ తరువాత మళ్లీ ఆ స్థాయి మార్క్‌కు చేరుకోలేదు. తాజాగా ఇప్పుడు లక్ష మార్కునుదాటి భారతదేశంలో రూ. 1లక్ష మార్క్ దాటిన తొలి స్టాక్‌గా ఎంఆర్ఎఫ్ అవతరించింది. దీపావళి నాటికి స్టాక్ రూ. 1.25లక్షలకుసైతం చేరుకొనే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.