UPI Charges : రూ. 2వేలు దాటితే యూపీఐ పేమెంట్లపై బాదుడే బాదుడు.. సామాన్యులకు ఈ కొత్త ఛార్జీలు వర్తిస్తాయా? NPCI క్లారిటీ ఇదిగో..!
UPI Charges : ఇప్పుడంతా డిజిటల్ మయం.. కరోనా పుణ్యమాని డిజిటల్ పేమెంట్ల వినియోగం భారీగా పెరిగింది. ప్రతిఒక్కరూ యూపీఐ పేమెంట్లపైనే ఆధారపడుతున్నారు.

New fees on UPI payments _ Why Paytm, GPay, PhonePe and other users need not worry
UPI Charges : ఇప్పుడంతా డిజిటల్ మయం.. కరోనా పుణ్యమాని డిజిటల్ పేమెంట్ల వినియోగం భారీగా పెరిగింది. ప్రతిఒక్కరూ యూపీఐ పేమెంట్లపైనే ఆధారపడుతున్నారు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు అందరూ గూగుల్ పే (Google Pay), పోన్‌పే (PhonePe), పేటీఎం (Paytm) ద్వారానే యూపీఐ పేమెంట్లు (UPI Payments) ఎక్కువగా నిర్వహిస్తున్నారు. సాధారణంగా యూపీఐ పేమెంట్లపై ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిసిందే. కానీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్లపై భారీగా ఛార్జీలు వర్తించనున్నాయి. సామాన్యులపై యూపీఐ అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. ఇప్పుడు అందరిలోనూ ఇదే ఆందోళన కనిపిస్తోంది. యూపీఐ పేమెంట్లు చేస్తే అదనపు ఛార్జీలు తప్పవంటూ సోషల్ మీడియాలోనూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దానికి కారణం.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త రూల్ ప్రతిపాదించడమే.. యూపీఐ పేమెంట్లపై ఇంటర్ ఛేంజ్ ఫీజులు విధిస్తున్నట్టు మార్చి 24వ తేదీన NPCI ఒక సర్య్యూలర్ జారీ చేసింది.
రూ.2వేలు దాటితే.. 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు :
దాని ప్రకారం.. 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఐ పేమెంట్లు చేసే వినియోగదారులపై ఇంటర్ ఛేంజ్ ఛార్జీలు వర్తించనున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)పై మర్చంట్ లావాదేవీలపై ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI) ఫీజులు వర్తించనున్నట్టు తెలిపింది. UPIలో రూ. 2వేల కన్నా ఎక్కువ లావాదేవీలపై PPI రుసుము విధించనున్నట్టు UPI చెల్లింపు వ్యవస్థ పాలకమండలి తెలిపింది. లావాదేవీ వాల్యూలో 1.1శాతం ఇంటర్ ఛేంజ్ ఛార్జీలు విధించినుంది. అయితే, బ్యాంక్ అకౌంట్ ఆధారిత UPI పేమెంట్లు లేదా సాధారణ UPI పేమెంట్లపై బ్యాంక్ అకౌంట్లపై ఎలాంటి ఛార్జీలు ఉండవని NPCI స్పష్టం చేసింది.

New fees on UPI payments _ Why Paytm, GPay, PhonePe and other users need not worry
UPIకి వినియోగదారులు UPI ఎనేబుల్ చేసిన యాప్‌లలో ఏదైనా బ్యాంక్ అకౌంట్, రూపే క్రెడిట్ కార్డ్ (Rupay Credit Card), ప్రీపెయిడ్ వ్యాలెట్లను ఉపయోగించుకునే ఆప్షన్ కలిగి ఉంటారని పేర్కొంది. ఆన్‌లైన్‌లో చేసే ఆర్థిక లావాదేవీలపై విధించే ఛార్జీలను ఇంటర్‌ఛేంజ్ ఫీజు అని చెప్పవచ్చు. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (కార్డ్స్, పేపర్ వోచర్స్, ఆన్‌లైన్ వాలెట్స్) ఉపయోగించి యూజర్లు చేసే UPI లావాదేవీలపై ఈ ఛార్జీలు వర్తిస్తాయి. దీని ప్రకారం. బ్యాంకులు, PPI వ్యాలెట్ మధ్య జరిగే పీర్-టు-పీర్ (Peer-to-Peer), పీర్-టు-పీర్-మర్చంట్ (Peer-to-merchants) లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని గమనించాలి.
NPCI Press Release: UPI is free, fast, secure and seamless
Every month, over 8 billion transactions are processed free for customers and merchants using bank-accounts@EconomicTimes @FinancialXpress @businessline @bsindia @livemint @moneycontrolcom @timesofindia @dilipasbe pic.twitter.com/VpsdUt5u7U— NPCI (@NPCI_NPCI) March 29, 2023
వాస్తవానికి.. యూపీఐ పేమెంట్లు వినియోగదారులందరికి ఒకే విధంగా వర్తించవు. ఒక్కో రంగానికి ఒక్కోలా ఛార్జీలు విధిస్తారు. రంగాన్ని బట్టి 0.5నుంచి నుంచి 1.1శాతం వరకు ఛార్జీలు వర్తించనున్నాయి. డీజిల్, పెట్రోల్ పేమెంట్లపై 0.5శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది. విద్య, వ్యవసాయం, టెలికాం రంగాలపై 0.7శాతం, సూపర్ మార్కెట్లలో 0.9శాతం ఛార్జీలు వర్తిస్తాయి.మ్యూచువల్ ఫండ్స్ వాటిపై 1శాతం వరకు వసూలు చేయనున్నారు. అదే కస్టమర్లు తమ బ్యాంకు అకౌంట్లతో లింక్ అయిన యూపీఐ పేమెంట్లపై సదరు PPI జారీ చేసిన సంస్థలు కస్టమర్ల సంబంధిత బ్యాంకులకు 15 బేసిక్ పాయింట్లు చెల్లించాలి.
పేటీఎం యూజర్లకు గమనిక.. :
ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానున్న నేపథ్యంలో కస్టమర్లపై ఎలాంటి UPI ఛార్జీలు వర్తించవని ఇప్పటికే NPCI క్లారిటీ ఇచ్చింది. దీనిపై డిజిటల్ పేమెంట్ యాప్ (Paytm) కూడా ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘పేటీఎం యూజర్లకు గమనిక.. Paytm UPI పేమెంట్లు ఉచితం. చాలా వేగవంతమైనది. ఎంతో సురక్షితమైనది. బ్యాంక్ అకౌంట్ లేదా PPI/Paytm వ్యాలెట్ నుంచి UPI నుంచి పేమెంట్లు చేయడంపై ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన పనిలేదు’ అని పేటీఎం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా, బ్యాంకు, ప్రీపెయిడ్ వ్యాలెట్ మధ్య వ్యక్తి-వ్యక్తి లావాదేవీలు లేదా వ్యక్తి నుంచి వ్యాపారి లావాదేవీలకు రుసుము వర్తించదని తెలిపింది. ప్రస్తుతం సెప్టెంబర్ 30 లేదా అంతకు ముందు పేర్కొన్న ఛార్జీలపై NPCI సమీక్షిస్తుంది.