Apple Store App : ఇకపై ఆపిల్ ఫిజికల్ స్టోర్‌కు వెళ్లనక్కర్లేదు.. ఈ స్పెషల్ యాప్ ఉందిగా..!

Apple Store App : భారత్‌లో ఆపిల్ కంపెనీ విస్తరించేందుకు ఈ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఫిజికల్ ఆపిల్ స్టోర్లను సందర్శించాల్సిన అవసరం లేదు.

Apple Store App : ఇకపై ఆపిల్ ఫిజికల్ స్టోర్‌కు వెళ్లనక్కర్లేదు.. ఈ స్పెషల్ యాప్ ఉందిగా..!

Step Out To Visit An Apple Store Now

Updated On : January 17, 2025 / 8:42 PM IST

Apple Store App : భారతీయ ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. దేశంలోని ఆపిల్ ఔత్సాహికులు కంపెనీ లేటెస్ట్ ప్రొడక్టులను సులభంగా యాక్సస్ చేయొచ్చు. ఇకపై ఆపిల్ ప్రొడక్టులను కొనుగోలు చేసేందుకు ఫిజికల్ ఆపిల్ స్టోర్లను సందర్శించాల్సిన అవసరం లేదు. టెక్ దిగ్గజం భారత్‌లోని అధికారిక స్టోర్ కోసం ఒక ప్రత్యేక యాప్‌ను లాంచ్ చేసింది.

వినియోగదారులకు అవసరమైన కస్టమైజడ్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. దేశంలో ఇప్పటికే ఉన్న ఆపిల్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్ ఆపిల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర డివైజ్‌లకు బ్రౌజింగ్ కొనుగోలు చేసే ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది.

Read Also : Auto Expo 2025 : ఆటో ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని మోదీ.. 100కి పైగా వాహనాల ప్రదర్శనలు!

భారత్‌లో ఆపిల్ కంపెనీ తమ ఉనికిని విస్తరించేందుకు ఈ యాప్ అందుబాటులోకి తెచ్చింది. వ్యాపార వ్యూహాంలో భాగంగా మెట్రోపాలిటన్ ప్రాంతాలు, చిన్న నగరాలు, పట్టణాలు రెండింటిలోనూ వినియోగదారులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో ముంబై, న్యూఢిల్లీలో ప్రారంభమైన ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ల అవసరాన్ని తీరుస్తుంది. బెంగళూరు, పూణే, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబైలలో అదనపు స్టోర్‌లను స్థాపించే యోచనలో ఉంది.

కొన్ని ఆపిల్ స్టోర్ యాప్ ఫీచర్లు :
ప్రొడక్టు ట్యాబ్ : కస్టమర్‌లు ఆపిల్ లేటెస్ట్ ప్రొడక్టులు, అప్లియన్సెస్, ఫైనాన్సింగ్ ఆప్షన్లను అనుకూలమైన ప్రాంతంలో ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు.
ఫర్ యూ ట్యాబ్ : ఈ ట్యాబ్ ఒకరి బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా పర్సనలైజడ్ సిఫార్సులను అందిస్తుంది. ఒకరికి ఇష్టమైన వస్తువులను సేవ్ చేస్తుంది. సులభంగా యాక్సెస్ కోసం నిర్వహిస్తుంది.
ప్రొసీడ్ ట్యాబ్ : కొనుగోలు చేసిన తర్వాత వినియోగదారులు పర్సనలైజడ్ ఆన్‌లైన్ సెటప్ సెషన్ కోసం ఆపిల్ నిపుణులతో కనెక్ట్ కావచ్చు. ఉదాహరణకు.. ఒకరు ఎయిర్‌ప్యాడ్ కొనుగోలు చేసి వాటి ఉపయోగంలో సాయం కావాలంటే ఒక నిపుణుడు వారికి ప్రక్రియ ద్వారా మార్గనిర్దేశం చేయవచ్చు.

ఆపిల్ ఆన్‌లైన్ రిటైల్ హెడ్ కరెన్ రాస్‌ముస్సేన్ మాట్లాడుతూ.. “ఆపిల్‌లో చేసే ప్రతి పనికి మా కస్టమర్‌లు కేంద్రంగా ఉంటారు. మా సంబంధాన్ని మరింతగా బలోపేతం చేస్తూ భారత్‌లో మరింత మంది వినియోగదారులను చేరుకోవడానికి ఆపిల్ స్టోర్ యాప్‌ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆపిల్ స్టోర్ యాప్‌తో కస్టమర్‌లు మా అన్ని ఉత్పత్తుల కోసం షాపింగ్ చేసేందుకు పర్సనలైజడ్ అసిస్టెంట్ పొందడానికి సులభమైన మార్గాన్ని కలిగి ఉంటారు.

Read Also : Apple iPhone 17 Launch : భారీ అప్‌గ్రేడ్‌లతో ఆపిల్ ఐఫోన్ 17 వచ్చేస్తోంది.. మునుపెన్నడూ చూడని ఫీచర్లు..!